1. ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా  న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి  వన్డేలో టీమిండియా దుమ్ములేపుతోంది.

2. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన  టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. 

3. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, ఓపెనర్‌ శుబ్‌మన్‌  గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలతో  చెలరేగడంతో భారత్‌ 300 మార్క్‌ను దాటింది.

4. వీరికి తోడు సంజు శాంసన్‌ కీలక ఇన్నింగ్స్‌  ఆడగా.. చివర్లో వాషింగ్టన్‌ శివాలెత్తి ఆడాడు. 

5. వన్డేలో టీ20 స్టైల్‌కు మించిపోయే  బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. 

6. కేవలం 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు,  3 సిక్సులతో చెలరేగి.. 37 పరుగులతో  న్యూజిలాండ్‌ బౌలర్లను వణికించాడు. 

7. సుందర్‌ ధాటికి 280 వరకు వెళ్తుందనుకున్న  టీమిండియా స్కోర్‌ 306కు చేరుకుంది. 

8. వాషింగ్టన్‌ సుందర్‌ ఆడిన ఒక షాట్‌ మాత్రం  మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. 

9. మాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌లో  సుందర్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. 

10. ఆ ఓవర్‌లో చివరి మూడో బంతుల్లో  ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4, 4, 6తో  రెచ్చిపోయాడు.

11. అదే ఓవర్‌లో ఐదో బంతికి కొట్టిన  సిక్స్‌ మాత్రం సూపర్‌ షాట్‌గా నిలిచింది.

12. ఆఫ్‌ స్టంప్‌ ఆఫ్‌ సైడ్‌ వెళ్లున్న బంతిని ఫైన్‌లెగ్‌  మీదుగా స్కూప్‌ షాట్‌ ఆడి అదరగొట్టాడు.

13. సుందర్‌ ఆడిన ఈ షాట్‌ చూస్తుంటే..  మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌  గుర్తుకు వచ్చాడు. 

14. ఈ మ్యాచ్‌లో కేవలం 4 పరుగులతో  సూర్యకుమార్‌ నిరాశపర్చినా.. సుందర్‌  ఆ ఒక్క షాట్‌తో సూర్యను గుర్తు చేశాడు.