మన శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. దంత ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. నోటిని సరిగా క్లీన్ చేసుకోకపోతే దంత క్షయం, చిగుళ్ల వ్యాధులు వస్తాయి.

నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఇలా జరగకూడదంటే రోజకు రెండుసార్లు కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. కొన్ని రకాల ఫుడ్స్ తినాలి. అప్పుడే మీ దంతాలు స్ట్రాంగ్, హెల్తీగా తయారవుతాయి.

పాలు, పెరుగు లాంటి పాల ఉత్పత్తులు.. దంతాలని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి.

పాలు, జున్ను, పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పంటిపై ఎనామిల్ ని సంరక్షిస్తాయి. దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

పాల ఉత్పత్తుల్లోని పోషకాలు.. బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే కొన్ని ఆమ్లాలను తగ్గిస్తాయి.

రోజుకి 7-8 గ్లాసుల నీళ్లు తాగినా సరే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఇది మీ లాలాజలం పెరిగేందుకు సహాయపడుతుంది. దంతాల్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలని కూడా తొలగిస్తుంది.

ఆపిల్ పండు తిన్నాసరే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దంతక్షయం, చిగుళ్ల సమస్య వచ్చే అవకాశమే ఉండదని నిపుణులు అంటున్నారు.

పళ్లలో కుహరం ఏర్పడకుండా నిరోధించడానికి ఆపిల్స్ ఉపయోగపడతాయి. వీటిని నమిలి తినడం వల్ల దంతాలకు ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది.

విటమిన్ సీ ఉండే పండ్లు, కూరగాయలు కూడా దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే నారింజ, నిమ్మకాయలు, ఫైనాపిల్స్, టామాటా, దోసకాయలు.. మీ ఆహారంలో చేర్చుకోండి.

స్ట్రాబెర్రీల్లో ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి మీ దంతాలను తెల్లగా మెరిపించేందుకు సహాయపడతాయి.

విటమిన్ డీ వల్ల ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. దంతక్షయాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఎనామిల్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

సాల్మన్ చేపల్లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల దంత సమస్యలు రావని నిపుణులు అంటున్నారు.

బచ్చలి కూర, బ్రోకలీ, పాలకూర.. ఎన్నో అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

వీటిలో ఉండే విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్.. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి