అందుకే చలికాలంలో పిల్లలు, పెద్దలు పసుపు పాలని పక్కాగా తాగుతుంటారు. దీని వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.
పసుపు పాల వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గోల్డెన్ మిల్క్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతామో తెలుసా?
ఇక గోల్డెన్ మిల్క్ తయారు చేయడానికి గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపితే సరి.
ఈ పాల రుచి అందరికీ నచ్చకపోవచ్చు కానీ దీనిలో యాలకులు గింజలు, లవంగాల ముక్కలు, మిరియాల పొడి కలిపితే టేస్టీగా మారుతుంది.
గోల్డెన్ మిల్క్ లో యాంటీ ఇన్ఫామేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని కర్కుమిన్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎముకలు బలంగా తయారవడానికి, చర్మ సమస్యలు పోగొట్టి అందంగా మెరిసిపోవడానికి గోల్డెన్ మిల్క్ ఉపయోగపడుతుంది.
ఈ గోల్డెన్ మిల్క్ ని ఇంట్లో మాత్రమే తయారు చేసుకోండి. అలానే గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని తాగండి. అప్పుడే ప్రయోజనాలు దక్కుతాయి.
గోల్డెన్ మిల్క్ లోని కర్కుమిన్.. మెదడుని ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుంది. అలానే దీని వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం.. మూడ్ బూస్టర్ గానూ పనిచేస్తుంది. అంటే మీకు ఉన్న డిప్రెషన్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.
నిద్రపోయే ముందు గోరువెచ్చని పసుపు పాలని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది.
ఒకవేళ మీకు పాలు నచ్చకపోతే మజ్జిగ తీసుకోండి. దీని వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.