చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ లో చర్మం పొడిబారుతుంది.
చర్మం రంగు కూడా మారే అవకాశముంది. అందులోనూ డ్రై స్కిన్ ఉన్న వారికి చర్మ రక్షణ కొంచెం కష్టం.
అయితే చర్మం పొడిబారడానికి చాలానే కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది సరిపడా నీరు తాగకపోవడం.
చెప్పాలంటే మన బాడీ నీరు అవసరం కాదు అత్యవసరం. నీటితోనే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
ఇక చలికాలంలో నీరు ఎక్కువ తాగితే.. చీటికి మాటికి టాయిలెట్ కి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో కొందరు నీళ్లు అసలే తాగరు.
దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారుతుంది. దీన్ని అధిగమించాలంటే నీరు తాగాలి.
అలానే కొన్ని ఫేస్ ప్యాక్ లు వేసుకున్నా సరే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
బాగా పండి ఆవకాడో గుజ్జుకి కాస్త తేనే కలిపి పేస్టులా చేయండి. దీన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత నీటితో కడిగేస్తే చర్మంపై తేమ పెరుగుతుంది.
అరకప్పు బొప్పాయి ముక్కల్ని పేస్టులా చేసి, తేనే వేసి బాగా కలపండి. దాన్ని ముఖానికి రాసి 30 నిమిషాల తర్వాత కడిగితే.. ఫేస్ లో గ్లో వస్తుంది.
గుడ్డులోని తెల్లసొనలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, టీ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా కలపండి. ముఖంపై 30 నిమిషాలు పట్టించి చల్లని నీటితో కడిగేస్తే.. ముఖం తేమగా కనిపిస్తుంది.
టీ స్పూన్ కలబంద రసంలో టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ గంధం పొడి వేసి బాగా కలపండి.
ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే డ్రై స్కిన్ మటుమాయం అవుతుంది.
చెంచా ఓట్ మీల్ పొడిలో టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాలు మసాజ్ చేయండి. అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేయండి.
డ్రై స్కిన్ సమస్య ఉంటే కొబ్బరి నూనె ముఖానికి లైట్ గా రాసి మర్దన చేయండి. ఇది చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది.
నోట్: మేం చెప్పిన టిప్స్ పాటించే ముందు ఓసారి మీ దగ్గరలోని వైద్యులు, నిపుణుల సలహా కూడా తీసుకోండి