నల్ల నువ్వుల లడ్డూలని మన అమ్మమ్మల కాలం నుంచి తయారుచేస్తున్నారు. వాటిని తింటున్నారు.

ముఖ్యంగా చలికాలంలో పక్కాగా వీటిని తింటారు. రీసెంట్ టైంలో నల్ల నువ్వుల లడ్డూలకు భలే గిరాకీ పెరిగింది. ఎందుకంటే ఇవి హెల్తీ కాబట్టి.

ఇక చలికాలంలో నల్ల నువ్వుల లడ్డూ తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నొప్పి తగ్గుతుందని ప్రజలు నమ్ముతారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నల్ల నువ్వులతో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

నల్ల నువ్వుల్లోని ప్రోటిన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బలహీనతని తగ్గిస్తాయి.

నల్ల నువ్వులు కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

చలికాలంలో ఎముకలు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారికి చలికాలం చాలా కష్టంగా ఉంటుంది.

ఇలాంటి వారు నల్ల నువ్వులని తినడం వల్ల లేదా నల్ల నువ్వుల నూనెతో ఎముకలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పుల ప్రాబ్లమ్ తగ్గుతుంది.

నువ్వుల్లోని కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రాగి, కాల్షియం ఎముకలని బలంగా చేస్తాయి. ఇంట్లో పిల్లలకు నల్ల నువ్వులను కచ్చితంగా ఇవ్వండి. చాలా మంచిది.

చలికాలంలో రక్తప్రసరణ చాలా తగ్గుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్సులుంటాయి.

నల్ల నువ్వులు, మన శరీరాన్ని వెచ్చగా ఉంచడం సహా రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి. వీటి వల్ల షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయని చాలా పరిశోధనలు పేర్కొన్నాయి.

చలికాలంలో చర్మం తేమ కోల్పోతుంది. రంగు మారుతుంది. పూర్తి డ్రైగానూ మారిపోతుంది. జట్టు కూడా విపరీతంగా రాలుతుంది.

ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టడానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. నువ్వుల్లో థయామిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లేవిన్ లు ఉంటాయి.

ఇవి చర్మానికి, జుట్టుకు మంచివి. నువ్వులను తిన్నా లేదా వాటి నూనె ముఖానికి, జుట్టుకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. ఇలా రోజూ చేస్తే.. కేవలం నాలుగు రోజుల్లోనే తేడాను గుర్తిస్తారు.

నల్ల నువ్వులు దంతాలకు చాలా మంచిది. వీటిని ప్రతిరోజూ ఉదయం నమలడం వల్ల మీ దంతాలను బలంగా మారతాయి. దంత సమస్యలు కూడా తగ్గిపోతాయి.

శీతాకాలంలో సోమరితనం సాధారణం. కానీ నల్ల నువ్వులను తినడం వల్ల ఈ సీజన్ లో కూడా మీరు చురుగ్గా ఉంటారు.

శీతాకాలంలో పైల్స్ చాలా ఇబ్బంది పెడతాయి. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల మలవిసర్జన కష్టంగా మారుతుంది.

నువ్వుల వినియోగం వల్ల పైల్స్ తొలగిపోతాయి. నల్ల నువ్వులను ప్రతిరోజూ చల్లటి నీటితో కలిపి తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

నోట్: మేం చెప్పిన టిప్స్ పాటించే ముందు ఓసారి మీ దగ్గరలోని వైద్యులు, నిపుణుల సలహా కూడా తీసుకోండి