ఇంట్లోని దేవుడి మందిరంలో శంఖం ఉండటం శుభం. దీని వల్ల ఎలాంటి కష్టాలు ఉండవని నమ్ముతారు.

అందుకే పూజ సమయంలో, శుభకార్యాలు, పండగలకు దేవాలయాల్లో శంఖాన్ని కచ్చితంగా ఊదుతారు.

జ్యోతిష్యం ప్రకారం.. శంఖం పవిత్రమైనది. ఇంట్లో ఇది ఉంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే దేవుళ్లతో పాటు శంఖాన్ని పూజిస్తారు.

హిందూ పురాణాల ప్రకారం.. శంఖాన్ని కీర్తి, సమృద్ధి, దీర్ఘాయుష్షు కోసం పూజిస్తారు. శంఖంలోని ప్రతి భాగం దేవతల నివాసంగా చెప్తారు.

క్రమం తప్పకుండా శంఖం ఊదటం వల్ల ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. చర్మం బిగుతుగా మారుతుంది. దీనివల్ల యంగ్ గా కనిపిస్తారు.

రోజూ శంఖం ఊదితే నోట్లోని కండరాలపై ఒత్తిడి పడుతుంది. ముఖ కండరాలు స్ట్రాంగ్ అవుతాయి.

రెగ్యులర్ గా శంఖం ఊదితే.. ఊపిరితిత్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రోన్కైటిస్, ఆస్తమా రోగులు ఇలా చేయడం మంచిది.

శంఖం ఊదటం, వ్యాయామంలా పనిచేస్తుంది. శ్వాసలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. శ్వాస సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

శంఖాన్ని ప్రతిరోజూ ఊదితే ముత్రాశయం, పొత్తి కడుపు దిగువ భాగం, మెడ, భుజం కండరాలకు చాలా ప్రయోజనం. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథికి కూడా ప్రయోజనకరం.

ప్రతిరోజూ శంఖం ఊదితే పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. డిప్రెషన్ కూడా తగ్గుతుందట.

శంఖం ఊదటం వల్ల థైరాయిడ్ గ్రంథులు, స్వరపేటికలకు వ్యాయామం అవుతుంది. దీని వల్ల వాటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

శంఖం ఊదటం వల్ల శరీరంలోని వివిధ భాగాల మధ్య బంధం ఏర్పడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నోట్: ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాశాం. నెటిజన్స్ గమనించగలరు.