మెరిసే, ఆరోగ్యమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వయసు పెరుగుతున్నా సరే యంగ్ గా కనిపించాలని ఆశపడుతుంటారు.

నిజానికి మనకు శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. చర్మ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కానీ ఏజ్ పెరుగుతున్న విషయాన్ని చర్మం ఇట్టే చెప్పేస్తుంది.

అయితే కొందరికి మాత్రం తక్కువ వయసే ఉన్నప్పటికీ.. చర్మంపై ఇలాంటి సంకేతాలు కనిపిస్తుంటాయి.

ముడతలు, నల్లటి వలయాలు, పల్చటి గీతలు.. కేవలం పెద్దవారిలోనే కాదు.. ప్రస్తుతం చిన్నపిల్లల్లోనూ కనిపిస్తున్నాయి.

వయసుని తగ్గించలేం కానీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి కొన్ని ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది.

ఎందుకంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణలోనూ మనం తీసుకునే ఆహారం కీ రోల్ ప్లే చేస్తుంది.

చలికాలంలో ఆరెంజ్ ని తప్పకుండా తినాలి. ఇది ఇమ్యూనిటి పవర్ ని బాగా పెంచుతుంది. దీనిలోని విటమిన్ సీ.. చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వడదెబ్బ వల్ల కలిసి చర్మ సమస్యలని నారింజ నివారిస్తుంది. చర్మాన్ని నేచురల్ గా హైడ్రేట్ చేస్తుంది. చర్మం పొడిబారడాన్ని కూడా తగ్గిస్తుంది.

బచ్చలికూరలోని ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ కే, జింక్ లాంటి పదార్థాలు చర్మంపై ముడతలు తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని రోజూ తీసుకుంటే ముడతలు తగ్గే ఛాన్సుంది.

ఉసిరిలోని యాంటీ ఆక్సిటెండ్స్, విటమిన్ సీ, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 

దీనివల్ల చర్మం హెల్తీగా ఉంటుంది. దీని వల్ల ముడతలు లేటుగా వచ్చేలా ఉసిరి చేస్తుంది.

టమాటాలు తీసుకోవడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు, నల్లని మచ్చలు తొలగిపోతాయి. సూర్యకిరణాల వల్ల అయ్యే మొటిమలు తొలగించడానికి కూడా సహాయపడతాయి.

చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో క్యారెట్లు చాలా ఉపయోగపడతాయి. విటమిన్ ఏ, పొటాషియం, ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ క్యారెట్ లో సమృద్ధిగా ఉంటాయి.

క్యారెట్లు, మన చర్మంపై నల్లని మచ్చలను తొలగించడానికి ఉపయోగపడతాయి. ముఖాన్ని అందంగా, ఆకర్షణీయంగానూ ఇది చేస్తుంది.

నోట్:  పైన టిప్స్ పాటించే ముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.