నేటి ఆధునిక కాలంలో యువతి, యువకులకు ఉన్న ప్రధాన సమస్య అధిక బరువు.

దాంతో బరువును కోల్పోవడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.

బరువు తగ్గాలి అనగానే చాలా మంది ముందుగా చేసే పని అన్నం మానేయడం. అయితే అన్నం మానేయగానే బరువు తగ్గరు అంటున్నారు నిపుణులు.

అయితే చాలా మంది నెయ్యి, నెయ్యి పదార్థాలతో బరువు పెరుగుతారని అపోహ పడుతుంటారు. 

కానీ నెయ్యిని వాడే రీతిలో వాడితే సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.

అన్నం మానేసి రోటీని తినే వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే? 

సాధారణ రోటీ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు న్యూట్రీషియన్ నిపుణులు.

ఈ రోటీతో పాటుగా కాస్తంత నెయ్యిని కూడా తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు.

నెయ్యి తీసుకోవడం ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తగినంత నెయ్యిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా మెదడు పనితీరు కూడా మెరుగైతుందని చెబుతున్నారు నిపుణులు.

నెయ్యిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన నాడీ వ్యవస్థ, మెదడు, ఎముకల పనితీరు మెరుగుపడుతుంది.

రోటీతో నెయ్యిని కలిపి తినడం వల్ల అందులో ఉండే గ్లైసెమిక్ లోడ్ ను తగ్గించడంలో నెయ్యి సహాయపడుతుంది. అందువల్ల శరీరానికి నిరంతర శక్తి విడుదల అవుతుంది.

అదీకాక రోటీలో ఉండే గ్లూటెన్, ఫైబర్ నను సులభంగా జీర్ణం చేయడంలోనూ నెయ్యి ఉపయోగపడుతుంది.

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అవి వ్యాధి నిరోధన లింఫో సైట్ లను వృద్ధి చేస్తాయి.

నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు A,D,E,K లు ఉంటాయి. 

10 శాతం వరకు ఉండే ఆహారపు నెయ్యి ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపదని వైద్యులు సూచిస్తున్నారు. 

అందుకే నెయ్యితో కాల్చిన రోటీని తినాలని సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన టిప్స్ పాటించే ముందు మీ దగ్గర్లోని వైద్యుల సలహా గానీ, నిపుణుల సలహాలు గానీ పాటించండి.