సాధారణంగా చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం కంటే  స్పైసీ, స్వీట్ ఫుడ్ ను తినడానికే ఇష్టపడతారు.

ఇలాంటి ఫుడ్ వల్ల మీ ఆరోగ్యం మరింత దెబ్బతిన్నడమై కాకుండా ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తాయి. 

అందుకే ఇమ్యూనిటీ వ్యవస్థను బలంగా ఉంచే ఆహారాలనే తినండి.

అయితే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడతాయి. 

మరి ఎలాంటి పానీయాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం !

క్యారెట్, బీట్ రూట్  జ్యూస్ రోగ నిరోధ శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

ఈ జ్యూస్ లోపోషకాలతో పాటు విటమిల్లు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి.

ఈ జ్యూస్ శరీరాన్ని ఎన్నోరకాల రోగాలను నయం చేస్తాయి.

అవిసెగింజలు, పాలు, బాదం పలుకులతో తయారయ్యే ఈ కాలే స్మూతీలో అనేక రకాల పోష పదార్థాలతో నిండి ఉంటుంది. 

ఆవిసె గింజల ద్వారా మీ శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి.

గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. 

ఆకుకూరల జ్యూస్  శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అందుతాయి.

ఇండియన్ గూస్ బెర్రీగా పేరుపొందిన ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది పొట్టను శుభ్రపర్చడంతో పాటుగా రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది.

అలా ఈ పానీయాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.