నయన్‌ ప్రైవేట్‌ పార్ట్స్‌పై వల్గర్‌ కామెంట్లు!

హీరోయిన్‌ నయన తార- దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌లు  జులై నెలలో పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి  తెలిసిందే. 

దాదాపు 8 ఏళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల  సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. 

ఈ సెలెబ్రిటీ దంపతులు సరోగసి ద్వారా  ఇ‍ద్దరు పిల్లల్ని కన్నారు.

ఇక, అప్పటినుంచి వారిపై ట్రోలింగ్స్‌  జరుగుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే నయన తార ప్రైవేట్‌ పార్ట్స్‌పై  కామెంట్లు వస్తున్నాయి.

దీనిపై సింగర్‌ చిన్మయి ఫైర్‌ అయ్యారు.  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా 

ఇలా పాడు కామెంట్లు చేసే వారికి ఘాటుగా  సమాధానం ఇచ్చారు.

ఈ కామెంట్లు చేస్తున్న మగాళ్లు తల్లి పాలు తాగారా?  లేదా? నాకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

 వీళ్లకు ఆడ పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి?  అని ప్రశ్నించారు.

ఇంట్లో ఉన్న మగవాళ్ల ముందు కూడా  దుపట్టా వేసుకోమని 

ఓ తల్లి తన కూతురికి చెబుతున్న పరిస్థితి  ఉందని అన్నారు

ఈ మగాళ్లు ఇంట్లో ఉన్న ఆడవాళ్లను చూసి కూడా  ఇలానే రెచ్చిపోతారా? అని కూడా ప్రశ్నించారు. 

నయనతారపై కామెంట్లు చేసిన వారి స్క్రీన్‌  షాట్లను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.