వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. అలానే ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని మీకు అనిపించిందా?

పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు ఇలా చాలా వరకూ కావాల్సినవి ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంటే ఇంటికి వచ్చేస్తున్నాయి. 

అలాంటప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తే బాగుణ్ణు అని అనిపించిందా?

అయితే భారత ఎన్నికల సంఘం ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఓట్ ఫ్రమ్ హోమ్ పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది.   

పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లకుండా ఇంట్లో ఉండే ఓటు వేసేలా చర్యలు చేపడుతోంది. 

ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఈ విధానాన్ని అమలు చేయనుంది. 

అక్కడ సక్సెస్ అయితే ఇంటి నుంచి ఓటు వేసే కాన్సెప్ట్ ను మిగతా రాష్ట్రాల్లో అమలు చేయనున్నట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.     

అయితే ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం అందరికీ కాదు. కేవలం కొందరికి మాత్రమే. 

80 ఏళ్ళు పైబడ్డ వయసు వారికి, దివ్యాంగులకి మాత్రమే ఈ అవకాశం.

పోలింగ్ బూత్ దగ్గర ఎక్కువ సేపు నిల్చుని ఓటు వేయలేని వృద్ధుల కోసం, అలానే పోలింగ్ బూత్ కి రాలేని దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ని అమలు చేయనున్నారు.    

వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులు, 80 ఏళ్ళు పైబడిన వృద్ధులతో ఓట్లు వేయిస్తారన్నమాట. 

ఇంటి నుంచే ఓటు కాన్సెప్ట్ కర్ణాటకలో విజయవంతమైతే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. 

ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ విధానంతో నిజంగా నడవలేని వృద్ధులు, దివ్యాంగుల కష్టం తగ్గుతుంది.