బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలన్న తండ్రి కల అర్థాంతరంగా ఆగిపోయింది.

తండ్రి బాధను, కోరికను, ఆశను అర్థం చేసుకున్న యువతి బాగా చదివి మంచి కొలువు సాధించింది.

ఆమెనే విశాఖపట్నానికి చెందని ఈశ్వరి ప్రియ. అట్లాషియన్‌ కంపెనీలో ఏడాదికి రూ.84.5 లక్షల ప్యాకేజీతో కొలువు సాధించింది.

ఈశ్వరి ప్రియ తండ్రి శ్రీనివాసరావు.. ఎలక్ట్రికల్‌ స్పేర్‌ పార్ట్స్‌ అమ్మే వ్యాపారం చేసేవాడు. తల్లి రాధ గృహిణి.

ఈశ్వరి ప్రియకు సోదరుడు సందీప్‌ ఉన్నాడు. అతడు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

ఈశ్వరి ప్రియ తండ్రి శ్రీనివారసరావుకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మధ్యలోనే చదువు ఆపేశాడు.

తనలానే తన పిల్లలకు అవ్వకూడదని భావించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. వారిని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాడు.

పిల్లలకు కూడా తాను చదువుకోలేకపోయానని.. మీరైనా బాగా చదివి వృద్ధిలోకి రావాలని తరచుగా చెప్పేవాడు.

శ్రీనివాసరావు మాటలు పిల్లలపై బాగా ప్రభావం చూపాయి. ఇద్దరు బాగా చదువుకునేవారు.

ఈశ్వరి ప్రియ చిన్నప్పటి నుంచి చదువులో టాపర్‌. టెన్త్‌, ఇంటర్లో మంచి మార్కులు సాధించింది.

ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించడంతో ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు వచ్చింది. కంప్యూటర్‌ సైన్స్‌లో చేరింది.

ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉండగా.. ఈశ్వరీ మోర్గాన్‌ స్టాన్లీ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ కోసం సెలక్ట్‌ అయ్యింది.

 రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో భాగంగా నెలకు రూ.87 వేలు స్లైఫండ్‌ అందుకుంది ఈశ్వరి.

అంతేకాక ఇంటర్న్‌షిప్‌ పూర్తవ్వగానే మోర్గాన్‌ స్టాన్లీ కంపెనీ ఏడాదికి 28.7 లక్షల రూపాయల ప్యాకేజీతో.. ఈశ్వరికి జాబ్‌ ఆఫర్‌ చేసింది.

ఇదిలా ఉండగానే ఈశ్వరి అమెజాన్‌ సంస్థ నిర్వహించి కోడింగ్‌ టెస్ట్‌లోనూ సెలక్టయ్యింది.

ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఈశ్వరి అట్లాషియన్‌లో 84.5 లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించింది.

అట్లాషియన్‌లో ఉద్యోగం, ఇంటర్న్‌షిప్‌ కోసం దేశవ్యాప్తంగా 30 వేల మంది పోటీ పడ్డారు.

చివరకు 300 మంది మిగిలారు. వీరికి వివిధ టెస్ట్‌లు నిర్వహించారు.

ఆఖరికి ఉద్యోగం కోసం 10, ఇంటర్న్‌షిప్‌ కోసం 10 మందిని సెలక్ట్‌ చేశారు.

ఇక ఏపీ నుంచి ఉద్యోగం సాధించిన ఏకైక యువతి ఈశ్వరి కావడం విశేషం.