తెలుగు ప్రేక్షకులు నిజంగా సూపర్! ఎందుకంటే సినిమా నచ్చితే గుండెల్లో పెట్టేసుకుంటారు.

అందుకు తగ్గట్లే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తుంటారు.

కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు కానీ సమ్ థింగ్ డిఫరెంట్ అనిపించే స్టోరీలు చాలా తక్కువగా వస్తుంటాయి.

అలాంటి కథతో తీసిన సినిమానే 'విరూపాక్ష'. సాయిధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది.

ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయాల్సిందే.

కథ: తన సొంతూరు రుద్రవనంకి సూర్య(సాయిధరమ్ తేజ్) దాదాపు 15 ఏళ్ల తర్వాత తల్లితో కలిసి వస్తాడు.

వచ్చినరోజు రాత్రే నందిని (సంయుక్తా మేనన్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ లవ్ చేసుకుంటారు.

కానీ రుద్రవనంలో వరసగా నలుగురు వ్యక్తులు చనిపోతారు. దీంతో ఊరి వాళ్లందరూ తెగ భయపడిపోతారు.

ఆ సమస్యకు ఓ పరిష్కారం కూడా ఆలోచిస్తారు. దీంతో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఇంతకీ వరస మరణాలు వెనకున్న రీజన్ ఏంటి? చివరకు ఏమైంది? సూర్య-నందిని ఏమయ్యారో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ: 'విరూపాక్ష' గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే.. మనం చాలావరకు చాలా సినిమాల్లో చూసిన స్టోరీనే.

కాకపోతే కథా నేపథ్యం, మేకింగ్, స్క్రీన్ ప్లే లాంటి విషయాల్లో చేర్పులు మార్పులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు.

ప్రశాంతంగా ఉన్న ఊరు.. అనుకోని సమస్యల్లో చిక్కుకోవడం.. అదే ఊరికి హీరో రావడం.. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. సింపుల్ గా ఇదే స్టోరీ.

ఓ భార్యభర్తని ఊరి వాళ్లందరూ కలిసి సజీవ దహనం చేసే సీన్ తో ఫస్టాప్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు.

అలా అనుకునేలోపే హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ ని తీసుకొచ్చి కాస్త డిస్ట్రబ్ చేశారు. కానీ మరణాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో స్టోరీలో ఊపొస్తుంది.

ఓ అదిరిపోయే సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక అక్కడ నుంచి స్టోరీ చకాచకా సాగిపోతూ ఉంటుంది.

ఫస్టాప్ట్ లో ఊరిలోని కొందరు ఎందుకు సడన్ గా చనిపోతున్నారు అనే క్వశ్చన్ కి.. సెకండాఫ్ లో రివీల్ చేస్తూ రావడం బాగుంది.

స్క్రీన్ ప్లే రాసింది సుకుమార్ కావడం సినిమాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే చాలా విషయాల్లో ఫెర్ఫెక్ట్ డీటైలింగ్ ఇస్తూ వెళ్లారు.

సినిమాలో మిగతా అంతా ఏమో కానీ హీరోయిన్ నందిని క్యారెక్టర్ మాత్రం మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. మళ్లీ ఎక్కువ చెబితే స్పాయిలర్ అవుతుంది.

నటీనటులు పనితీరు: 'విరూపాక్ష' చూసిన తర్వాత మీకు హీరోయిన్ క్యారెక్టర్ భలే నచేస్తుంది. ఆమె పాత్రలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

ఫస్టాప్ లో ఎంత క్యూట్ గా, అందంగా కనిపించిందో.. సెకండాఫ్ లో డిఫరెంట్ వేరియేషన్, క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవల్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఈ స్టోరీలో హీరో సాయిధరమ్ తేజ్ సింపుల్ గా ఉంటుంది. బట్ బాగానే చేసి ఆకట్టుకున్నాడు. ఈ పాత్రని ఒప్పుకున్నందుకు అతడిని మెచ్చుకోవాలి.

మిగతా నటీనటుల్లో బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్ లాంటి స్టార్ట్స్ ఉన్నారు. కానీ వాళ్లు పాత్రలు చాలా పరిమితం.

రవికృష్ణ, సోనియా సింగ్, శ్యామల, అభినవ్ కూడా ఉన్నారు. బట్ వాళ్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉన్నంతలో డీసెంట్ గా చేశారు.

టెక్నికల్ టీమ్ పనితీరు: ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ ఉన్నాయి. అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు.

సుకుమార్ స్క్రీన్ ప్లే.. 'విరూపాక్ష'కి మరో ప్లస్ పాయింట్. డైరెక్టర్ కార్తీక్ కి ఇది తొలి ప్రయత్నమే అయినప్పటికీ బాగానే తీశాడు.

నిర్మాణ విలువలు, సెట్ వర్క్ అన్నీ సరిగా సరిపోయాయి. ప్రతి సీన్ చూస్తుంటే ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా పెట్టారనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: సాయిధరమ్ తేజ్, సంయుక్తా మేనన్ యాక్టింగ్ సినిమాటోగ్రఫీ స్టోరీ డీటైలింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ ఫస్టాప్ లో లవ్ స్టోరీ కొన్నిసీన్లలో సాగదీత

రేటింగ్: 2.5

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే