టాలీవుడ్ లో ప్రతివారం లెక్కకు మించి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి.
వాటిలో చాలా కొన్ని మాత్రమే హిట్ కొట్టి, ప్రేక్షకుల్ని వీలైనంతగా ఎంటర్ టైన్ చేస్తుంటాయి.
అలా గత నెలలో థియేటర్లలో రిలీజై, ఇప్పటికే అలరిస్తున్న సినిమా అంటే 'విరూపాక్ష' పేరు చెప్తారు.
తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన ఔట్ అండ్ ఔట్ హారర్ మూవీ కూడా ఇదే అని చెప్పొచ్చు.
ఎందుకంటే గతంలో అమ్మోరు, అరుంధతి లాంటి ఫుల్ లెంగ్త్ హారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
కానీ ఆ తర్వాత హారర్ జానర్ కి కామెడీని మిక్స్ చేయడం వల్ల పూర్తిగా భయపడటం చాలా వరకు తగ్గిపోయింది.
ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసిన 'విరూపాక్ష'.. సినిమాలో దెయ్యం అనేది లేకపోయినా వేరే లెవల్లో భయపెట్టింది.
దీంతో ఈ మూవీ కోసం ఓటీటీ లవర్స్ తెగ ఎదురుచూస్తూ వచ్చారు. నార్మల్ గా అయితే ఈ పాటికే వచ్చేయాలి.
కానీ థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా ఆడుతుంటడం వల్ల దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.
ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు కూడా.
'విరూపాక్ష' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. ఇప్పుడు మే 21 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది.
దీన్నిబట్టి చూసుకుంటే.. థియేటర్లలో విడుదలైన నెల రోజులకే 'విరూపాక్ష' ఓటీటీలోకి రానుంది.
రీసెంట్ టైమ్ లో 'దసరా', 'శాకుంతలం', 'రావణాసుర', 'ఏజెంట్'.. ఇలా అన్ని మూవీస్ నెలలోనే వచ్చేశాయి.
ఇప్పుడు ఈ లిస్టులోకి చేరిన 'విరూపాక్ష' కూడా జస్ట్ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసి, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైపోయింది.
మరి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి.