భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, యువ క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చేసిన తప్పుకు సారీ చెప్పాలంటూ భరత్‌కు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్టు గురువారం ప్రారంభమైంది.

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించుకుంది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 255 పరుగులు చేసింది.

ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా సెంచరీతో చెలరేగాడు.  టీమిండియా టాప్‌ క్లాస్‌ బౌలర్లను సైతం సాలిడ్‌ డిఫెన్స్‌తో అడ్డుకున్నాడు. 

ఖవాజా బ్యాటింగ్‌తో టీమిండియా బౌలర్లే కాకుండా ఫీల్డర్లు సైతం అలసిపోయారు.

ఈ క్రమంలో టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌.. ఖవాజాను బాల్‌ తీసుకొని కొట్టాడు.

షమీ బౌలింగ్‌లో డెడ్లీ బౌన్సర్‌ను తప్పించుకునే క్రమంలో ఖవాజా క్రీజ్‌లో బ్యాలెన్స్‌ తప్పి కిందపడ్డాడు.

తిరిగి లేస్తున్న క్రమంలో ఖవాజా క్రీజ్‌ బయటికి వెళ్లి ఉంటాడని భావించిన భరత్‌.. వికెట్లకు త్రో వేశాడు. 

అది కాస్త మిస్‌ ఫైర్‌ అయి.. నేరుగా వెళ్లి ఖవాజా కాలికి తగిలింది.

పక్కనే స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ.. భరత్‌ చేసిన పనికి షాక్‌ అయ్యాడు. 

పొరపాటున కొట్టినా.. బ్యాటర్‌ను బాల్‌తో కొట్టడం తప్పేనని భరత్‌ను వారించి, ఖవాజాకు సారీ చెప్పాలని కోరాడు. 

కోహ్లీ లాంటి వ్యక్తి చెప్పడంతో తాను కావాలని కొట్టలేదని భరత్‌ నవ్వుతూ సారీ చెప్పడంతో ఖవాజా సైతం చిరునవ్వుతో ప్రతిస్పందించాడు.