అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రతీ సంవత్సరం అత్యుత్తమమైన ఆటగాళ్లను ఎంపిక చేసి టెస్ట్, వన్డే, టీ20 జట్లను ప్రకటిస్తుంది.

తాజాగా 2022 సంవత్సరానికి గానూ టీ20 జట్టును ప్రకటించింది ఐసీసీ. 

ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురు ప్లేయర్స్ కు చోటు దక్కింది.

అందులో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీతో పాటుగా సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు కూడా చోటు దక్కించుకున్నారు.

ICC ప్రకటించిన 2022 టీ20 టీమ్ లో చోటు దక్కించుకోవడం ద్వారా కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

క్రికెట్ చరిత్రలోనే ఈ రికార్డు నెలకొల్పిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు విరాట్.

ఐసీసీ ప్రకటించిన అన్ని ఫార్మాట్ల జట్లలో అంటే టెస్టులు, వన్డేలు, టీ20 జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ గా కింగ్ విరాట్ కోహ్లీ నిలిచాడు.

గతంలో ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ లో 3 సార్లు, వన్డేల్లో 6 సార్లు, తాజాగా 2022 టీ20 టీమ్ లో కూడా స్థానం సంపాదించాడు విరాట్ కోహ్లీ.

దాంతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షారాలతో లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ.

అయితే టెస్టుల్లో, వన్డేల్లో ఎప్పుడో ఐసీసీ టీమ్ లో చోటు దక్కించుకున్న విరాట్.. టీ20ల్లో చోటుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది.

2022 ఆసియా కప్ నుంచి టచ్ లోకి వచ్చిన విరాట్ తర్వాత జరిగిన  టీ20 వరల్డ్ కప్ లో 296 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.

అదీకాక మూడు సంవత్సరాల తన శతక దాహాన్ని ఆఫ్ఘనిస్తాన్ పై తీర్చుకుని తన సత్తా నిరూపించాడు.