ఆసియా కప్‌లో అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీ సాధించాడు.

చాలా రోజుల తర్వాత చేసిన 71వ సెంచరీతో కోహ్లీ 12 రికార్డులు కొల్లగొట్టాడు.

భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రోహిత్‌ శర్మ 118 రికార్డును కోహ్లీ తన సెంచరీ(122 నాటౌట్‌)తో బద్దలుకొట్టాడు. 

టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీ చేసిన భారత నాలుగో క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

టీ20ల్లో సెంచరీ చేసిన భారత ఆరో బ్యాటర్‌ కోహ్లీనే.

71 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి ముందు సచిన్‌ 100 సెంచరీలతో నంబర్‌ వన్‌గా ఉన్నాడు.

టీ20ల్లో 100 సిక్సులు కొట్టిన రెండో భారత బ్యాటర్‌ కోహ్లీనే. ప్రపంచ వ్యాప్తంగా 10వ క్రికెటర్‌

కోహ్లీ కొట్టిన 122 పరుగులే యూఏఈలో అత్యధిక టీ20 వ్యక్తిగత స్కోర్‌

టీ20ల్లో 3500 పరుగుల మార్క్‌ను దాటిన రెండు ఆటగాడు కోహ్లీనే.

ఈ సెంచరీతో కోహ్లీ 24000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ మార్క్‌ దాటిన 7వ ఆటగాడిగా నిలిచాడు.

సచిన్‌, ద్రవిడ్‌ తర్వాత 24000 పరుగులు చేసిన మూడో భారత్‌ క్రికెటర్‌ కోహ్లీనే.

కేవలం 522 ఇన్నింగ్స్‌ల్లో అత్యంత వేగంగా 24000 పరుగులు పూర్తి చేసి, 540 ఇన్నింగ్స్‌లో 24వేల పరుగులు చేసిన సచిన్‌ రికార్డును బద్దలుకొట్టాడు.

ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన ఏకైన ఆటగాడు కోహ్లీనే.

ఈ సెంచరీతో కోహ్లీకి 13వ మ్యాచ్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో టీ20ల్లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డుల జాబితాలో నబితో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు.