‘మా’ ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ఆ హోరాహోరీ పోరులో మంచు విష్ణు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కంటే 107 ఓట్లు అదనంగా పోల్ అయ్యాయి.

విష్ణు విజయం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు.

అందులో అతని భార్య బ్యాక్ గ్రౌండ్ కూడా విష్ణు విజయానికి కారణమని టాక్ వినిపిస్తోంది.

మంచు విష్ణు సతీమణి కుంటుబం నేపథ్యం, ఆమె ఎవరు అనే ఆసక్తికర విషయాలు మీకోసం.

మంచు ఫ్యామిలీ చాలా సందర్భాల్లో సీఎం జగన్ మాకు కావాల్సిన వ్యక్తి అంటూ ఉండటం తెలిసిందే.

మంచు విష్ణు ఏపీ సీఎం జగన్ కు బంధువే. అతని భార్య విరనికా రెడ్డి సీఎం జగన్ కు చెల్లి అవుతుంది.

ఆమె వైఎస్ రాజారెడ్డి నాలుగో కుమారుడు సుధాకర్ రెడ్డి కుమార్తె.

పుట్టి పెరిగింది అమెరికాలోనే. కొన్నాళ్ల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చింది విరనికారెడ్డి.

ఆ తర్వాత మంచు విష్ణుతో పరిచయం ఏర్పడటం. అది ప్రేమగా మారడం.. ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కడం చకచకా జరిగిపోయాయి.

విష్ణు- విరనికా దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు మంచు విష్ణు. అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది విరనికారెడ్డి.

ఆమె భర్తచాటు భార్యగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతుందట.

కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడం అంటేనే ఇష్టమంటోంది విరనికారెడ్డి.

పాలిటిక్స్, సినిమా రెండు బ్యాక్ గ్రౌండ్లు ఉన్నా.. ఎందులోనే ఇంట్రస్ట్ లేకుండా సైలెంట్ గా ఉండటమే అందుకు పెద్ద ఉదాహరణ.