ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి.
మామూలు జ్వరమో, వైరల్ ఫీవరో తెలియక ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.
జలుబు, జ్వరాలు, విపరీతమైన దగ్గు, ఒళ్లు నొప్పులు, కళ్లు మంటలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.
వైరల్ ఫీవర్స్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్యులు పలు సూచనలు చేశారు
వేసవి వచ్చినప్పటికీ.. చలి కాలం పూర్తి కాలేదని, వాతావరణ మార్పుల కారణంగానే ఇలా వైరల్ ఫీవర్స్ వస్తున్నట్లు చెబుతున్నారు.
జలుబు, జ్వరం, దగ్గు తగ్గకుండా వస్తే వైరల్ ఫీవర్ గా గుర్తించాలి
ఐదు రోజుల పాటు తగ్గకుండా వస్తే వైద్యుడ్ని సంప్రదించాలి
బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తీసుకుని వెళ్లాలి, గోరు వెచ్చని నీళ్లు తాగాలి
నీరసించకుండా ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి
జ్వరం వస్తే పారాసెటామల్ వేసుకోవాలి, దగ్గు వస్తే కాఫ్ సిరప్ తీసుకోవాలి
అత్యధిక మోతాదులో యాంటీ బయోటిక్స్ వాడొద్దు
ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులు జ్వరం, జలుబు, దగ్గు వస్తే.. సొంత వైద్యం మంచిది కాదు
డెంగ్యూ, కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలి