(Cast & Crew) కిచ్చా సుదీప్, నిరూప్ బండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవిశంకర్ గౌడ (దర్శకత్వం) అనూప్ బండారి (సంగీతం) అజనీష్ లోకనాథ్ (నిర్మాత ) మంజునాథ్, శాలిని మంజునాథ్, అలంకార్ పాండ్యన్
రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ మూవీతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు హీరో కిచ్చా సుదీప్
అప్పటినుండి తన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు
తెలుగులో బాహుబలి, సైరా లాంటి సినిమాలలో చిన్నచిన్న రోల్స్ చేసాడు.
సుదీప్ చాలా గ్యాప్ తీసుకొని ‘విక్రాంత్ రోనా’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు
ట్రైలర్, టీజర్, రారా రక్కమ్మ సాంగ్, విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి
ఈ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకుడు.
సుదీప్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో విక్రాంత్ రోనా నిర్మించబడింది
మరి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం!
ఆ ఊరిలో అతీంద్రియ శక్తులు దాగున్నాయని నమ్మి జనాలు బ్రతుకుతుంటారు ఆ గ్రామంలో వరుసగా భయంకరమైన సంఘటనలు జరుగుతుంటాయి
ఈ క్రమంలో ఆ ప్రాంతానికి కొత్త ఎస్సైగా విక్రాంత్ రోనా(కిచ్చా సుదీప్) వస్తాడు అప్పటినుండి విక్రాంత్ రోనా జర్నీ ఎలా సాగింది? ఆ కొమరట్టు గ్రామం కథేంటి? అనేది తెరపై చూడాలి
కిచ్చా సుదీప్ నుండి ఎన్నో యాక్షన్ సినిమాలు చూస్తూ వచ్చారు ప్రేక్షకులు థ్రిల్లర్ నేపథ్యంతో చాలా సినిమాలే వచ్చాయి. విక్రాంత్ రోనా.. కూడా థ్రిల్లరే
పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ రోనాగా సుదీప్ ఎంట్రీ మంచి కిక్ ఇస్తుంది అద్భుతమైన యాక్షన్, సస్పెన్స్ లతో పాటు హారర్ సీన్స్ భయపెట్టవచ్చు
సెకండాఫ్ లో రారా రక్కమ్మ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ విక్రాంత్ రోనాకు మేజర్ ప్లస్ లు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
సినిమా అంతా 95 శాతం నైట్ లోనే సాగుతుంది జాక్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండ్యన్ ల నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి