నగరం, ఖైదీ, మాస్టర్ లాంటి వరుస హిట్లతో  తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న లోకేష్..

తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’      అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందించాడు. 

 ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి,   ఫాహద్ ఫాజిల్ లాంటి బిగ్ స్టార్స్ సపోర్టింగ్ రోల్స్    చేసేసరికి విక్రమ్ పై అంచనాలు తారాస్థాయికి                                   చేరుకున్నాయి. 

 విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ల నటన కమల్ హాసన్              స్థాయిని మరోస్థాయిలో ఎలివేట్ చేసిందా లేదా                                  అనేది రివ్యూలో చూద్దాం! 

కథ:

    చెన్నై నగరంలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి.       ఈ మర్డర్ మిస్టరీని చేసేందుకు పోలీస్ వారు స్పెషల్  ఆఫీసర్ అమర్(ఫాహద్ ఫాజిల్)కి ఈ కేసును అప్పగిస్తారు.

అయితే మర్డర్స్ చేస్తుంది మాస్క్ వేసుకున్న మనిషి                                      అని గ్రహిస్తాడు!

విశ్లేషణ:

డార్క్ యాక్షన్ సినిమాలను తీయడంలో తాను దిట్ట     అని ఇదివరకే ఖైదీ, మాస్టర్ సినిమాలతో ప్రూవ్       చేసుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.

ఓపెనింగ్ సీన్ తోనే ఇంటరెస్టింగ్ ఎపిసోడ్ తో విక్రమ్    ఫస్ట్ హాఫ్ మొదలయింది. మాస్క్ ధరించిన మనిషి  ఎందుకు వరుస హత్యలు చేస్తున్నాడు అనేది చాలా                        సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది 

కర్ణన్ పాత్రలో కమల్ హాసన్ వేరే లెవెల్ లో రెచ్చిపోయారు.       నిజానికి ఒకటి కాదు.. ఆయన్ని దర్శకుడు చూపించిన                  వేరియేషన్స్ అన్నీ పీక్స్ లో ఉంటాయి. 

  కమల్ కి తోడు టాలెంటెడ్ స్టార్ యాక్టర్స్ విజయ్ సేతుపతి,   ఫాహద్ ఫాజిల్ సినిమాకు మేజర్ హైలైట్స్. వాళ్ల క్యారెక్టర్స్,              క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానంబాగుంది. 

మొత్తంగా విక్రమ్ ఓ యాక్షన్ ప్యాకెడ్ థ్రిల్లర్ గా మేజర్  సక్సెస్ అందుకుందని చెప్పడంలో సందేహం లేదు.  విక్రమ్ కథలో ఖైదీ సినిమా కథను ముడివేసిన విధానం                     మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. 

ముఖ్యంగా క్లైమాక్స్ లో మేజర్ ట్విస్టు హీరో సూర్య ఎంట్రీ..                               గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 

విక్రమ్ సినిమాకు యాక్టర్స్, డైరెక్టర్ తర్వాత సినిమాటోగ్రఫీ,                    మ్యూజిక్ బ్యాక్ బోన్స్ గా నిలిచాయి.  

ఇక అనిరుధ్ మ్యూజిక్ విక్రమ్ ని మరోస్థాయికి    తీసుకెళ్లిందని చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్           గ్రౌండ్ మ్యూజిక్ ఆదరగొట్టేసాడు.

చివరిగా విక్రమ్ కి సీక్వెల్స్ వచ్చినా      ఆశ్చర్యపోయే అవసరం లేదు. 

విక్రమ్ మూవీ రేటింగ్: 3/5