హీరో కమ్ డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ గేయ రచయిత కమ్ ప్లే బ్యాక్ సింగర్ ఇలా 24 క్రాఫ్టులో సగం విభాగాల్లో అనుభవం ఉన్న నటుడు విజయ్ ఆంథోనీ.
తెలుగు సినిమాలకు కూడా ఆయన సుపరిచితమే. మహాత్మ, దరువు చిత్రాలకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. తమిళంలో కూడా బడా హీరోలకు సంగీతాన్ని అందించారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. నటుడిగా, డైరెక్టర్‌గా మారాడు. డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగులోకి పరిచయమయ్యాడు.
నకిలీ, డాక్టర్ సలీం వంటి సినిమాలతో మెప్పించిన.. ఆయన బిచ్చగాడి(పిచ్చైకారన్)తో క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత సైతాన్, కాళి, తమిళరాసన్ వంటి సినిమాలు చేసినా చెప్పుకో తగ్గ గుర్తింపు రాలేదు.
అయితే ఇప్పుడు బిచ్చగాడి-2 మీదే ఆయన ఆశలను పెట్టుకున్నాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు గాయపడ్డ విజయ్ ఆంథోనీ చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన సంగతి విదితమే.
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు 2 సినిమా మే 19న రాబోతోంది. ఈక్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అడవి శేషు, ఆకాష్ పూరి అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా విజయ్ ఆంథోని భార్య, ఈ సినిమా నిర్మాత ఫాతిమా మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.
సంక్రాంతి సమయంలో మలేషియాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు విజయ్‌కి ప్రమాదం జరిగిందని, చెన్నైలో ఉన్న సయమంలో కాల్ చేయని మేనేజర్ కాల్ చేశాడని చెప్పారు.
మేడమ్ ,మేడమ్..సార్‌కి యాక్సిడెంట్ అయ్యింది. ఆయన స్పృహలో కూడా లేడు. ఆయన నీళ్లల్లో పడిపోయాడు. ఫోన్ కట్ అయ్యింది’అని స్టేజ్ పైనే ఏడ్చేశారు.
పలు సార్లు ఫోన్ చేస్తే.. ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. తానేమో చెన్నైలో పిల్లలతో ఉండిపోయాను. అంతా అయిపోయిందనుకున్న సమయంలో..
తి ఒక్కరు మేసేజ్ చేశారని, ధైర్యంగా ఉండమంటూ, సార్ మళ్లీ ఆరోగ్యంగా తిరిగి వస్తారంటూ తనకు ట్విట్టర్‌లో, ఫేస్ బుక్‌లో సందేశాలు పంపారన్నారు.
అదే తనకు కాన్ఫిడెంట్ ను ఇచ్చిందని, మీరందరు కోరుకున్నట్లే ఆయన తిరిగి వచ్చాడని, ఇదంతా మీ ప్రేమ వల్లనే అంటూ ఎమోషనల్ అయ్యారు.
మేము ఎప్పుడు, మీ ప్రేమలోనే బతుకుతాం అని అన్నారు. అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటామని కంటతడి పెట్టుకున్నారు.
బిచ్చగాడు సినిమాని ఎలా అయితే బ్లాక్ బస్టర్ చేశారో.. రెండో పార్ట్‌ను కూడా అలానే బంఫర్ హిట్ చేయాలని కోరారు.