అలా క్రమశిక్షణ లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వాటిలో ముఖ్యమైనది ఒంట్లో బాగా వేడి చేయడం.
ఒంట్లో వేడి ఎక్కువ అయితే ఇంకొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే వట్టి వేర్లతో చేసే ఈ పొడిని రోజూ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
కొందరిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడం, ముఖం నల్లగా అవ్వడం జరుగుతుంది.
కొందరిలో వేడి వల్ల చర్మ, కంటి సమస్యలు కూడా వస్తుంటాయి.
అలా వేడి వల్ల వచ్చే సమస్యలను వట్టి వేరు చూర్ణం వాడటం వల్ల అధిగమించవచ్చు.
అయితే దీనిని పిల్లలు, పెద్దలు వివిధ మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.
3 నుంచి ఏడేళ్ల మధ్య పిల్లలు పావు టీస్పూన్, 7 నుంచి 16 ఏళ్ల మధ్య పిల్లలు అర టీ స్పూన్ తీసుకోవచ్చు.
16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాళ్లు రోజులో ఒక టీస్పూన్ చొప్పున తీసుకోవచ్చు.
మీరు తాగే నీటిలో ఈ వట్టివేర్ల పొడిని కలుపుకుని రోజంతా తాగొచ్చు.
ఇవి మీ పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియాని కూడా నశించేలా చేస్తాయి.
ఇలా రోజూ వట్టివేరు పొడి నీళ్లు తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది.
నోట్: పై చిట్కాలను పాటించే ముందు దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి.