వేణు అంటే కేవలం జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా మాత్రమే ప్రేక్షకులకు తెలుసు.

జబర్దస్త్‌ నుంచి బయటకు వెళ్లిన తర్వాత సినిమాల్లో కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువ.

కమెడియన్‌గా, జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు.. బలగం సినిమాతో మెగా ఫోన్‌ పట్టడమే కాక.. భారీ విజయం సాధించాడు.

అచ్చమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, యాసలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమా చూసిన ప్రతి వారు.. మూవీలోని ఏదో ఒక సీన్‌తో వారి నిజ జీవితాలు కనెక్ట్‌ అయ్యేలా ఉండటంతో భారీ విజయం సాధించింది.

ఈ సినిమాకు పాటలే పెద్ద బలం. సినిమా విజయంలో పాటలు ప్రధాన పాత్ర పోషించాయి అనడంలో అతిశయోక్తి లేదు.

మరీ ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో వచ్చే బుడగజంగాల పాట సినిమాను నిలబెట్టింది.

సినిమాలో ఈ పాట పాడింది కూడా రియల్‌ బుడగ జంగాలే. వారు వరంగల్‌ జిల్లాకు చెందిన కొమురవ్వ, మొగిలయ్యలు.

వీరి స్వగ్రామం వరంగల్‌ జిల్లా, దుగ్గొండి మండల కేంద్రం. ఈ క్రమంలో శుక్రవారం వేణు, తన స్నేహితులతో కలసి మొగిలయ్య ఇంటికి వెళ్లాడు.

కారణం మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతడి రెండు కిడ్నీలు పాడయ్యాయి.

డయాలసిస్‌ మీదనే ఆధారపడి జీవినం కొనసాగిస్తున్నాడు.

మొగిలయ్య సమస్య తెలుసుకున్న బలగం దర్శకుడు వేణు.. సింగర్‌ ఇంటికి వెళ్లి.. ఆయనను పరమార్శించాడు.

మొగిలయ్య సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని.. ఉచితంగా మందులు అందించేలా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాం అని తెలిపాడు.

ఈ సందర్భంగా మొగిలయ్య, కొమురవ్వను సత్కరించారు వేణు, అతడి స్నేహితులు.

వేణు, బలగం గీత రచయిత కాసర్ల శ్యామ్‌, మరో యాంకర్‌ కలిసి మొగిలయ్యకు 70 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

అంతేకాక మొగిలయ్య అకౌంట్‌లో 30 వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు.

అలానే మొగిలయ్య సమస్యను చిత్ర నిర్మాత దిల్‌ రాజు దృష్టికి తీసుకెళ్లి.. ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చాడు వేణు.