బాలయ్య అంటే మాస్.. మాస్ అంటే బాలయ్య అని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే ఆయన కూడా అలాంటి మూవీస్ చేస్తుంటారు.
గత కొన్నేళ్లలో బాలయ్య ఏ సినిమా చేసినా సరే.. అందులో ఫుల్ గా మాస్ ఎలిమెంట్స్ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు.
అలా 2021 డిసెంబరులో రిలీజైన 'అఖండ'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఇప్పుడు 'వీరసింహారెడ్డి'గా వచ్చేశారు.
సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ: 'వీరసింహారెడ్డి' కథ ఇస్తాంబుల్ లో స్టార్ట్ అవుతుంది. జై సింహారెడ్డి(బాలకృష్ణ), తల్లి మీనాక్షి(హనీరోజ్) సంరక్షణలో పెరుగుతాడు.
ఓ రోజు ఈషా(శ్రుతిహాసన్)తో పరిచయమవుతుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. పెద్దలని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతారు.
సరిగా ఆ టైంలో తన తండ్రి వీరసింహారెడ్డి బతికే ఉన్నాడని జైకు తెలుస్తుంది. కట్ చేస్తే కథ కర్నూలుకు వెళ్తుంది.
వీరసింహారెడ్డి ఆ ప్రాంతం మొత్తాన్ని శాసిస్తుంటాడు. అతడిని చంపాలని ప్రతాప్ రెడ్డి(దునియా విజయ్) పగతో రగిలిపోతుంటాడు.
కొన్ని ఊహించని పరిణామాల వల్ల వీరసింహారెడ్డి.. కొడుకు పెళ్లి చూసేందుకు ఇస్తాంబుల్ వెళ్తాడు. అదే టైంలో భానుమతి(వరలక్ష్మి శరత్ కుమార్) అతడిపై రివేంజ్ ప్లాన్ చేస్తుంది.
మరి వీరసింహారెడ్డితో భానుమతికి ఉన్న వైరం ఏంటి? జైసింహా, మీనాక్షిలు సీమకు ఎందుకు దూరంగా ఉన్నారు? అనేది తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: బాలయ్య సినిమా అంటే స్టోరీ దాదాపు ఒకే టెంప్లేట్ లో సాగుతుంది. దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా 'వీరసింహారెడ్డి' కథ ఉంటుంది. ట్రైలర్ చూస్తే మీకు అది అర్థమైపోతుంది.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ అంచనాలు పెంచేయడంతో 'వీరసింహారెడ్డి' విషయంలో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.
ఇక హీరోహీరోయిన్ల పరిచయం దగ్గర నుంచి వాళ్ల పెళ్లి ప్రస్తావన రావడం, సీమలో వీరసింహారెడ్డి క్యారెక్టర్ ని మాస్సివ్ ఎలివేషన్స్ తో పరిచయం చేస్తూ స్టోరీని తీసుకెళ్లారు.
అదే ఊర్లో విలన్ ప్రతాప్ రెడ్డి, భానుమతిల ఇంట్రడక్షన్స్, వాళ్ల స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ లతో ఫస్టాఫ్ ముగుస్తుంది.
వీరసింహారెడ్డి యాక్షన్, ఫైట్స్.. ఊహించని ట్విస్టులతో ఇంటర్వెల్ బ్యాంగ్ సెట్ చేశారు.
సెకండాఫ్ లో వీరసింహారెడ్డికి.. కథలో మిగతా క్యారెక్టర్స్ కి మధ్య లింక్స్ ఏంటి? అనేది ఫ్లాష్ బ్యాక్ ద్వారా రివీల్ అవుతుంటాయి.
సెకండాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు.
అయితే 'వీరసింహారెడ్డి' చూస్తున్నంతసేపు కూడా ఈ సీన్స్ ఎక్కడో చూశామే అన్న ఫీలింగ్ వస్తుంది.
అలానే డైరెక్టర్ బాలయ్య పాత సినిమాల రిఫరెన్సులనే ఎక్కువగా తీసుకున్నాడా అనిపిస్తుంది.
ఓవరాల్ గా చూసుకుంటే నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే మూమెంట్స్ మూవీలో చాలాచోట్ల ఉన్నాయి. సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. బాలయ్య అదరగొట్టేశారు. మిగిలిన క్యారెక్టర్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ రోల్ బాగా రాసుకున్నారు.
హనీరోజ్, శ్రుతిహాసన్, దునియా విజయ్ తదితరులు ఉన్నంతమేర ఆకట్టుకున్నారు.
టెక్నికల్ గా చూసుకుంటే.. కథలో కొత్తదనం లేకపోవడం వల్ల సినిమాలో, క్యారెక్టర్స్ లో బలం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. తమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు.
రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, గోపీచంద్ మలినేని డైరెక్షన్ ఆకట్టుకున్నాయి. బాలయ్య-దునియా విజయ్ ల మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.
ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ విశ్వరూపం, మెయిన్ క్యారెక్టర్స్, మ్యూజిక్, ఎమోషన్స్, కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్: స్టోరీ లైన్, సినిమా నిడివి, సాగదీసిన డ్రామా