పెద్ద సినిమాలు లేక విసుగుచెందిన ప్రేక్షకులు మంచి యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తుండగా వచ్చిన యాక్షన్ ప్యాకెడ్ మూవీ 'వలిమై'.
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన పూర్తి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పెద్ద సినిమాలు లేక విసుగుచెందిన ప్రేక్షకులు మంచి యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తుండగా వచ్చిన యాక్షన్ ప్యాకెడ్ మూవీ 'వలిమై'.
ట్రైలర్, టీజర్లతో భారీ అంచనాలు క్రియేట్ చేసిన వలిమై చిత్రం.. 2022లో బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా విడుదలైన వలిమై విశేషాలు ఏంటో చూద్దాం.
కథ: సమాజంలో ఉద్యోగాలు లేని యువకులను డ్రగ్స్ సరఫరా చేసేందుకు బైక్ రేసర్లుగా ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్న ఓ క్రిమినల్ నెట్ వర్క్ ని.. ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అంతం చేసాడు.. అనేది వలిమై సినిమా కథ.
విశ్లేషణ: పూర్తి యాక్షన్ సినిమాగా తెరకెక్కిన వలిమై.. చిత్రంలో పవర్ ఫుల్ ఏసీపీ అర్జున్ కుమార్ గా అజిత్ కనిపించగా.. యువతను తప్పుదోవ పట్టించే క్రిమినల్ నరేన్ పాత్రలో కార్తికేయ గుమ్మకొండ నటించాడు.
ఏసీపీకి సహకరించే సోఫియా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కనిపించింది.
వలిమై చిత్రం యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు కంప్లీట్ విందు భోజనం అనే చెప్పాలి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలదన్నే రీతిలో వలిమైని రూపొందించారు మేకర్స్.
ఏసీపీ అర్జున్ కుమార్ గా తల అజిత్ మరోసారి అరిపించేసాడు. అజిత్ నిజజీవితంలో మంచి బైక్ రేసర్ కావడంతో.. బైక్ స్టంట్స్, చేసింగ్ సీక్వెన్స్, ఫైట్స్ లో అజిత్ హాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు.
విలన్ నరేన్ గా కార్తికేయ నటన అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్, ఫైట్స్ లో కొత్త కార్తికేయను కంప్లీట్ కొత్త కార్తికేయను పరిచయం చేసాడు దర్శకుడు.
బడ్జెట్ పరంగా వలిమై సినిమా టాప్ అనే చెప్పాలి. బోణి కపూర్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో నిర్మాణ విలువలు హై లెవెల్ లో ఉన్నాయి.
ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచాయి. మరోసారి అజిత్ - యువన్ కాంబోలో మ్యాజిక్ రిపీట్ అయింది.
ఇక సినిమాటోగ్రఫి విషయానికి వస్తే.. వలిమైని మరోస్థాయికి తీసుకెళ్ళింది. పింక్, రోబో 2.O చిత్రాలకు పనిచేసిన నీరవ్ షా.. వలిమైకి సినిమాటోగ్రఫీ అందించారు.
యాక్షన్ సన్నివేశాలలో కెమెరా పనితనం ఐఫీస్ట్ గా ఉంటుంది. ఎడిటర్ విజయ్ వెల్ కుట్టి ఫస్ట్ హాఫ్‌లో ఎడిటింగ్ కి కాస్త పని చెప్పాల్సి ఉందని అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్.. స్క్రీన్ ప్లే రేసిగా తీసుకెళ్లాడు దర్శకుడు హెచ్. వినోద్. కథపై క్లారిటీ ఉన్న దర్శకుడు.
. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో.. స్క్రీన్ ప్లే పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కానీ తన మార్క్ యాక్షన్ మాత్రం రాబట్టగలిగాడు వినోద్.
చివరిమాట: వలిమై.. బిగ్గెస్ట్ యాక్షన్ ఫీస్ట్! రేటింగ్: 7.5/10