ప్రియురాలికి బహుమతి ఇచ్చే విషయంలో అబ్బాయిలు ఎంత చురుకుగా ఆలోచిస్తారో.. ప్రియుడికి ఇవ్వాల్సిన గిఫ్ట్ విషయంలో మాత్రం అమ్మాయిలు తడబడుతుంటారు.
2. ప్రేమించినవారు దూరంగా ఉంటే:
దూరంగా ఉంటూ ప్రేమించుకోవడం అనేది గొప్ప విషయమే. కానీ ఆ బంధాన్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ప్రేమించినవారు మీకు దూరంగా ఉన్నట్లయితే
3. పుస్తకాలు చదివే అలవాటు ఉంటే:
మీరు ప్రేమించిన వ్యక్తికి బుక్స్ చదివే అలవాటు ఉంటే.. అతను చదవాలి అనుకొని ఇంతవరకు చదవలేక పోయిన బుక్స్ ని గిఫ్ట్ గా ఇవ్వండి.
4. ఎక్కువ కంఫర్ట్ కోరుకునే వారైతే:
సాధారణంగా మగవారు ఎక్కువ కంఫర్ట్ ని కోరుకుంటారు. కాబట్టి మీ ప్రేమించిన వారు ఏమిస్తే సౌకర్యవంతంగా ఫీల్ అవుతారో అవి తెలుసుకోండి.
కానీ ఇది లవ్ సీజన్ కనుక హుడి(Hoodie) ఉండే జాకెట్స్ ఇవ్వడం బెటర్. ఎల్లప్పుడూ ఆ హుడిలో మీ ప్రేమను ఆస్వాదిస్తుంటారు.
మీరు ప్రేమించిన అబ్బాయి ఎక్కువగా క్రికెట్ ని ఇష్టపడితే.. మీతో కలిసి మ్యాచ్ చూడాలని కోరుకుంటాడు. ఒకవేళ మీకు క్రికెట్ అంటే ఇష్టం లేకపోతే.. అతని ఫేవరేట్ టీమ్ జెర్సీ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేయండి.
మీరు ప్రేమించిన వ్యక్తి ఎక్కువగా స్కిన్ కేరింగ్ ఇష్టపడితే.. వారికి రెగ్యులర్ గా ఉపయోగించే మంచి షేవింగ్ సెట్ ఇవ్వండి. ఎందుకంటే.. ఆ వస్తువు వాడినప్పుడల్లా వారికి మీరే గుర్తొస్తారు.