గత కొన్ని రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు గ్రామాల్లోని చాలా మంది పచ్చని చెట్ల కింద సేద తీరుతారు.

నగరాల్లో ఉండే ప్రజలకు మాత్రం ఇలాంటి సదుపాయం అందుబాటులో ఉండదు.

మరీ ముఖ్యంగా చాలా వరకు సిటీల్లో చాలా మంది ఏసీలు వాడుతుంటారు.

ఏసీ ద్వారా చల్లదనం ఉండడంతో అందరూ దానిని వాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

AC ఎక్కువగా వాడడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

AC వాడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు నగరాల్లోని అందరూ ACలకు అలవాటుపడుతున్నారు.

AC వాడే క్రమంలో మరీ కూల్ గా కాకుండా 26లో పెట్టుకుంటే సరిపోతుందట.

ACకి అలవాటు పడిన వారు ఎండలో ఎక్కువ సేపు ఉండలేరు. తొందరగా డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.

మొదట్లో శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 దీంతో పాటు గొంతు సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయట.

చర్మం పొడి బారడంతో పాటు, చర్మంపై దురదలు వస్తాయి.

రూమ్ అంతా చల్లగా అయ్యే వరకు ఉంచుకుని ఆ తర్వాత AC ఆఫ్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.