ఒళ్లు కాస్త వేడిగా అనిపించినా, కొంచెం నలతగా ఉన్నా మనలో చాలామంది పారాసెటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసేస్తారు.

తలనొప్పి, దగ్గు, జ్వరం, జలుబు.. ఇలా ప్రతి సమస్యకు సర్వరోగ నివారిణిలా పారాసెటమాల్ తీసేసుకుంటారు.

ఇది అస్సలు మన ఒంటికి మంచిది కాదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ఎక్కువ పనివల్ల జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది.

ఈ అలసట పోయేందుకు చాలామంది పారాసెటమాల్‌ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు.

వాతావరణ కాస్త మారి, సీజనల్‌ రోగాలొచ్చినా సరే ఇదే మందు. ఒకవేళ మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి.

ఎందుకంటే డాక్టర్స్ ని అడగకుండా దీన్ని యూజ్ చేస్తే మాత్రం మీ లైఫ్ ఎండ్ అయిపోతుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

పారాసెటమాల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల లివర్(కాలేయం) ఫెయిల్ అవుతుందని న్యూ ఢిల్లీ ఫోర్టిస్ హాస్పిటల్ డాక్టర్ మనోజ్ శర్మ హెచ్చరిస్తున్నారు.

రెండు రోజులకు మించి జ్వరంగా ఉంటే వైద్యుడిని సంప్రదించకుండా ఈ మందులు అస్సలు తీసుకోవద్దని డాక్టర్ ఎరిక్ విలియమ్స్ సూచిస్తున్నారు.

డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యాన్ని పాటించకూడదు.

ఎందుకంటే దీని ప్రభావం సుదీర్ఘకాలంపాటు శరీరానికి ప్రమాదంలో పడేస్తుంది.

కేవలం జ్వరం మాత్రమే కాదు ఏ కొంచెం తలనొప్పి అనిపించిన పారాసెటమల్‌ మందులు వేసుకునే అలవాటును వెంటనే ఆపివేయాలి,

ఈ అలవాట్లు కాలక్రమేణా శరీరంపై చెడు ప్రభావం చూపుతాయని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

నోట్: పై విషయాలు పాటించేముందు మీ దగ్గరలోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.