మనం ఒకసారి ఉపయోగించిన నూనెని మళ్లీ వంటల్లో ఉపయోగిస్తుంటాం. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా ఇలా చేస్తుంటాం.

బజ్జీలు, పకోడీలు, పూరీలు లాంటివి చేసినప్పుడు ఆ నూనె మిగిలిపోయింది. 

దీంతో దాన్ని మనం కూరల్లో యూజ్ చేస్తూ ఉంటాం.

పదే పదే ఇలా చేయడం వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మరి ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది ఇప్పుడు చూద్దాం.

ఒకసారి వాడిన నూనెని మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 

కాబట్టి పదేపదే ఒకే నూనెని ఉపయోగించకండి.

ఒకసారి వాడిన నూనెని మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల ఉదరకోశ సమస్యలు కూడా వస్తాయి.

మళ్లీ మళ్లీ అదే నూనెని ఉపయోగించడం వల్ల అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఒకసారి నూనెను ఉపయోగించగానే అందులోని పోషక పదార్థాలు మొత్తం మనం తీసుకుంటాము.

మళ్లీ వేడి చేస్తే ఈ నూనె.. చెడు కొలెస్ట్రాల కింద మారిపోతుంది. దీనితో గుండె సమస్యలు ముప్పు పెరుగుతుంది.

ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ యూజ్ చేయడం వల్ల అది ఫుడ్ పాయిజన్ కింద మారుతుంది.

దీంతో కడుపులో నొప్పి, మంట లాంటి సమస్యలు వస్తాయి.

కాబట్టి అనవసరంగా ఇటువంటి తప్పులు చేసుకుని అనారోగ్య సమస్యల బారిన పడకండి.

నోట్: పైన టిప్స్ మాకు దొరికిన సమాచారం ఆధారంగా రాశాం. గమనించగలరు.