OnePlus: స్మార్ట్‌ఫోన్ వాడే వారికీ ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. కాకుంటే.. కాస్త ధర ఎక్కువ. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. దాని రేట్ ఎక్కువ.. అంత డబ్బు మనమెక్కడ పెట్టగలం అనేవారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని.. మరింత మందికి దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతో.. వన్‌ప్లస్ సంస్థ ‘నార్డ్ సిరీస్’ ను తీసుకొచ్చింది.
వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ధర రూ.20 నుంచి 30 వేల ఉండడంతో.. యూజర్స్ వన్ ప్లస్ కు బాగానే అట్ట్రాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో ఎంపిక చేసిన మోడళ్లపై 25 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
ఎవరైనా వన్‌ప్లస్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని వేచి ఉంటే.. ఇదొక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఆఫర్ చేస్తున్న మొబైల్స్ లో.. వన్‌ప్లస్ 10ప్రో 5జీ, వన్‌ప్లస్ 10ఆర్ 5జీ, నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, వన్‌ప్లస్ 9 5జీ, వన్‌ప్లస్ 9ప్రో 5జీ వంటి మోడల్స్ ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ అసలు ధర రూ.19,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 5శాతం డిస్కౌంట్‌తో రూ.18,999 కి అందుబాటులో ఉంది. అలాగే.. కొనుగోలు సమయంలో క్రెడిట్ కార్డ్‌తో రూ. 1000 అదనపు తగ్గింపు లభిస్తుంది. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
1. 6.59 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే 2. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ 3. ట్రిపుల్ కెమెరా సెటప్ (64ఎంపీ + 2ఎంపీ +2ఎంపీ) 4. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 5. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 6. 33వాట్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 7. ఆండ్రాయిడ్ 12 ఓఎస్
వన్‌ప్లస్ 9 5జీ అసలు ధర రూ.49,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 24శాతం డిస్కౌంట్‌తో రూ.37,999 కి అందుబాటులో ఉంది.
1. 6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోలెడ్ డిస్‌ప్లే 2. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ 3. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ (48ఎంపీ + 50ఎంపీ +2ఎంపీ) 4. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 5. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 6. 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 7. ఆండ్రాయిడ్ 11 ఓఎస్
వన్‌ప్లస్ 9ప్రో 5జీ అసలు ధర రూ.64,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 23శాతం డిస్కౌంట్‌తో రూ.49,999 కి అందుబాటులో ఉంది.
1. 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే 2. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ 3. బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాల సెటప్ (48ఎంపీ + 50ఎంపీ +8ఎంపీ +2ఎంపీ) 4. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 5. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 6. 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 7. 50వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 8. ఆండ్రాయిడ్ 11 ఓఎస్
వన్‌ప్లస్ 10ఆర్ 5జీ అసలు ధర రూ.38,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 10శాతం డిస్కౌంట్‌తో రూ.34,999 కి అందుబాటులో ఉంది. రూ.3 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.దీనితో పాటు వన్‌ప్లస్ బడ్స్ Z2ని కేవలం రూ.3,999కె సొంతం చేసుకోవచ్చు.
1. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే 2. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ఎంఏఎక్స్ ఎస్ఓసీ చిప్‌సెట్ 3. ట్రిపుల్ కెమెరా సెటప్(50ఎంపీ +8ఎంపీ +2ఎంపీ) 4. సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 5. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 6. 80వాట్ సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ మొబైల్ అసలు ధర రూ.66,999 గా ఉంది. కానీ, ప్రస్తుతం 7శాతం డిస్కౌంట్‌తో రూ.61,999 కి అందుబాటులో ఉంది. ఆఫర్లు ఇలా.. రూ.5 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, వన్‌ప్లస్ బడ్స్ Z2ని కేవలం రూ.2,999, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ ప్రోను కేవలం రూ.5,999.
1. 6.7 అంగుళాల క్యూహెచ్ డి+ (1,440ఎక్స్3,216 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే 2. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్ ప్రొటెక్షన్ 3. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్ 4. ట్రిపుల్ కెమెరా సెటప్(48ఎంపీ +50ఎంపీ +8ఎంపీ) 5. 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ ఎక్స్615 ఫ్రంట్ కెమెరా 6. 5,000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 7. 80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్ 8. 50 వాట్ వైర్ లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్