ప్రపంచంలో వాటర్ తర్వాత ఎక్కువగా తాగేది టీ(ఛాయ్)

ముఖ్యంగా ఇండియాలో టీ(Tea) లవర్స్ కోట్లలో ఉన్నారు

ఇండియా నుండి ఇతర దేశాలకు టీ ఎగుమతి!

క్రీస్తుపూరం 2737లో చైనా చక్రవర్తి షెన్ నంగ్ టీని కనిపెట్టారు

షెన్ నంగ్ తాగే వేడినీటిలో ఓ తేయాకు అనుకోకుండా పడటంతో టీ ప్రస్థానం మొదలైంది

శతాబ్దాలపాటు టీని ఔషధంగా ఉపయోగించారు.

ప్రపంచంలో ప్రధానంగా నాలుగు రకాల టీలు ఉన్నాయి. బ్లాక్, గ్రీన్, వైట్, ఊలాంగ్ రకాలు.

కామెల్లియా సినెన్సిస్(Camellia sinensis) అనే మొక్కతో టీలు తయారీ అవుతున్నాయి

ఏప్రిల్ - మే మధ్యలో పెరిగిన తేయాకులతో గ్రీన్ టీ తయారవుతుంది.

ప్రపంచంలో గ్రీన్ టీ ది బెస్ట్ అని చెబుతుంటారు

ఇండియాలో టీని పాలు, తేనె, వెనీలా, అల్లం, లంవంగాలు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలను వాడుతుంటారు

1908లో టీ బ్యాగుల వాడకం మొదలైంది

అమెరికాలో థామస్ సల్లివాన్ అనే వ్యక్తి మొదటగా టీ బ్యాగులను కనుగొన్నారు

టీ బ్యాగులు 6 నెలల వరకే ఫ్లేవర్ కలిగి ఉంటాయి

రెండో ప్రపంచయుద్ధం వరకూ అమెరికాలో గ్రీన్ టీ ఫేమస్. ఆ తర్వాత బ్లాక్ టీ ఫేమస్ అయ్యింది

1904లో ఐస్ టీని వర్జీనియాలో కనుగొన్నారు

టీ ఆకులను గురించి అధ్యయనం చేయడాన్ని టస్సియోగ్రఫీ (tasseography) అంటారు

కొరియా, చైనాలో 'క్రిసాంతెమమ్' అనే హెర్బల్ టీని బాగా తాగుతారు. అది జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుంది.

తైవాన్‌ లో బబుల్ టీ (బుడగల టీ), ఇటలీలో ఆలివ్ టీ చాలా ఫేమస్

టిబెట్‌ లో వెన్న టీ (బటర్ టీ), జపాన్‌ లో జెన్‌మైచా అనే టీ పాపులర్ అయ్యింది.