దేశంలోని ప్రముఖులకు, వీఐపీలకు, వీవీఐపీలకు దౌత్యవేత్తలకు కేంద్ర ప్రభుత్వం  భద్రత కల్పిస్తుంది.

వీరికే కాకుండా సినీ, క్రీడాకారులకు కూడా కొన్ని సందర్భాల్లో భద్రత కల్పిస్తుంది.

సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడేందుకు వీరికి వివిధ కేటగిరీలో భద్రతను కల్పిస్తారు.

ఎస్పీజీ, X,Y, Y+, Z, Z+ కేటగిరీలు గా విభజించి.. ప్రముఖలకు భద్రత కల్పిస్తారు.

అయితే ఈ కేటగిరీల ప్రత్యేకత, అధికారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

భద్రత కేటగిరీల్లో అత్యంత పటిష్టమైనది ఎస్పీజీ  భదత్ర. ఇది కేవలం దేశ ప్రధాని, ఆయన కుటుంబానికి మాత్రమే ఉంటుంది.

1984 అక్టోబర్ లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీని సొంత బాడీ గార్డులే కాల్చి చంపారు.

ఆ తర్వాత 1985 మార్చి 30న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అనే భద్రత కేటగిరి వచ్చింది.

ఎస్పీజీ తర్వాత అధిక భద్రత కలిగిన కేటగిరీ Z ప్లస్ కేటగిరీ.

కేంద్ర మంత్రులతో పాటు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వారికి జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తారు.

 కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వంటి వారికి జడ్ ప్లస్ భద్రత ఉంది.

జడ్ కేటగిరీ భద్రతా దళంలో 22 మంది ఉంటారు. వీరు సెలబ్రిటీలకు, వీఐపీలకు ఈ జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు.

వై ప్లస్ కేటగిరీలో 11 మందితో కూడిన అధికారుల బృందం ఉంటుంది.

ఇక ఎక్స్ కేటగిరీ అనేది చివరి కేటగిరీ భద్రత. గౌరవప్రదమైన వ్యక్తులకు, సెలబ్రిటీలకు  ఈ భద్రతను  కల్పిస్తారు.

ఇలా దేశంలోని ప్రముఖలకు వివిధ స్థాయిలో భద్రతను కల్పిస్తుంటారు.