ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం మనదే. దేశ జనాభాలో దాదాపు 40 శాతం మంది భారతీయులు మాంసాహారం ముట్టరు.
ఇక దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చట.
ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.
ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.
వరల్డ్ రికార్డులు క్రియేట్ చేయడంలో మనదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.
సెన్సస్ ప్రకారం.. మనదేశంలో 19500 కంటే ఎక్కువ మాట్లాడే మాతృభాషలు ఉన్నాయి.
అన్ని యూరోపియన్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.