అసలు పరగడుపున నీళ్లు తాగడం ఏంటి? బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
బ్రష్ చేసేకన్న ముందే నీళ్లు తాగడం ద్వారా నోట్లో ఉన్న లాలా జలం కడుపులోకి వెళ్లి లోపల దాగి ఉన్న హానికర బ్యాక్టీరియాను చంపేస్తుందట.
ఉదయం పూట ప్రతీ ఒక్కరు మంచి నీళ్లు తీసుకోవడం ద్వారా ట్యాక్సిన్ విడుదల కావడంతో ముఖంపై వచ్చిన మొటిమల కూడా తొలగిపోతాయట.
ఉదయం పూట బ్రష్ చేయకుండా మంచి నీళ్లు తాగితే శరీరంలోని జీవ క్రియలు సజావుగా సాగుతాయట.
ఇలా పరగడుపున మంచి నీళ్లు తాగడం ఆరోగ్యంగా ఉండడంతో పాటు రోజూ యాక్టివ్ గా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.