సాధారణంగా కట్నం అనగానే ఆడపిల్ల తల్లిదండ్రులు వరుడు కుటుంబానికి ఇస్తారు.

ఎక్కడైనా ఇదే జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉంటాయి.

ఈ కోవకు చెందినదే మేనకోడలికి.. మేనమామలు కట్నం ఇవ్వడం.

రాజస్థాన్‌లో ఈ సంప్రదాయం అమల్లో ఉంది. దీన్ని మైరా అంటారు.

తోబుట్టువుకు ఆర్థిక భారం తగ్గించడం కోసం ఇక్కడ మేనమామలే కట్నం ఇస్తారు.

ఇక తాజాగా రాజస్థాన్‌, నాగౌర్‌ జిల్లా బుర్డీ గ్రామంలో రికార్డు స్థాయిలో మైరా ఇచ్చారు.

మేనకోడలి పెళ్లి సందర్భంగా ఆమె మేనమాములు ముగ్గురు ఏకంగా మూడు కోట్ల రూపాయలకు పైగా కట్నం ఇచ్చారు.

నగదు, భూమి, వస్తు, ఆభరణాల రూపంలో మేనకోడలికి ఈ కట్నం అందించారు.

వీరు ఇచ్చిన ఈ భారీ మైరాలో సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమి, రింగ్ రోడ్డు పక్కన 30 లక్షలు విలువ చేసే ప్లాట్ ఉంది.

అంతేకాక వివాహం సందర్భంగా మేనకోడలికి 41 తులాల బంగారం, మూడు కేజీల వెండి కూడా పెట్టారు.

దీంతో పాటు 80 లక్షల నగదు, ఓ ట్రాక్టర్‌, స్కూటీని కూడా బహుకరించారు.

బుర్డీ గ్రామానికి చెందిన భన్వర్‌లాల్  కుమారులు హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్రలు ఈ ముగ్గురు మేనమామలు.  

వీరు తమ సోదరి అనుష్క కుమార్తె వివాహం సందర్భంగా ఇంత భారీ మైరా ఇచ్చారు.

ఈ ముగ్గురు సోదరుల పేరు మీద 2,166 ఎకరాల భూమి ఉంది.

తమ మేనకోడలి వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని భావించారు.

అందుకే తమ ప్రాంతంలో ఎవరు ఇవ్వనంత మైరా ఇచ్చి రికార్డు సృష్టించారు.

నూతన దంపతులు నిండు నూరేళ్ళు, పిల్లాపాపలతో వర్థిల్లాలని ఆశీర్వదించారు మేనమామాలు.

అంతేకాక ఈ ప్రాంతంలో మేనల్లుడి పెళ్లి ఖర్చు కూడా మేనమామలే భరించాలి.