మనలో చాలామందికి సంప్రదాయాలకు, పద్దతులకు సంబంధించి చిన్న చిన్న సందేహాలు ఉంటాయి.
ఇప్పుడు అలాంటి ఒక చిన్న సందేహం గురించి చూద్దాం.
అబ్బాయిలు కొంత మంది నడుముకు మొలతాడు ధరిస్తారు.
అసలు మొలతాడు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు.
మొలతాడు ధరించడం వల్ల ఆధ్యాత్మికం గా.. సైన్స్ పరం గా అనేక లాభాలు ఉంటాయి.
పూర్వం డాక్టర్లు ఉండరు. కాబట్టి పాము, తేలు వంటి కుట్టిన సమయంలో ఈ మొలతాడుతో ఉపయోగపడుతుంది.
పాము, తేలు కుట్టిన ప్రదేశాన్న మొలతాడుతో గట్టిగా కట్టిన తరువాత విషంతో కూడిన రక్తాన్ని తీసేవారు.
అలాగే గాయాలు అయిన సమయం లో మొలతాడు తో కట్టే వారు.
అలాగే ఆధ్యత్మికం గా మొలతాడు కట్టు కోవడం వల్ల ఎలాంటి దిష్టి మనకు తగలదు.
మొలతాడు నడుముకు ధరించడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుందంట.
హెర్నియా అనే వ్యాధి రాకుండా ఉండటానికి కూడా మొలతాడు ను కట్టుకోవాలంట.
కొన్ని ప్రాంతాలలో మొలతాడు వల్ల జననావయవాలు ఆరోగ్యం గా ఉంటాయని నమ్ముతారు.
అందుకే ఆ ప్రాంతాలలో పురుషులతో పాటు మహిళ లు కూడా మొలతాడు ను కట్టుకుంటారు.
అలాగే గతం లో బెల్ట్ వాడకం లేకపోవడంతో ధరించిన వస్త్రాలు ఆగటానికి మొలతాడు కట్టుకునే వారు.
అనేక రకాల ఉపయోగాలు ఉండటంతో ఇప్పటి కీ కూడా అబ్బాయిలు మొలతాడు కట్టుకుంటారు.