చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే హీరో అల్లరి నరేష్ తన రూటు మార్చారు. కథాబలం ఉన్న చిత్రాలు చేసేందుకు ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన నటించిన ‘నాంది’ సినిమా మంచి విజయం సాధించింది.
‘నాంది’ తర్వాత గతేడాది ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించారు నరేష్. ఆ సినిమా ఊహించనింతగా సక్సెస్ కాలేదు.
దీంతో ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలతో మళ్లీ ఆయన జట్టుకట్టారు. వీరి కాంబోలో తెరకెక్కిన ‘ఉగ్రం’ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది.
‘ఉగ్రం’లో సీఐ శివ కుమార్ పాత్రలో నటించారు అల్లరి నరేష్. సిన్సియర్, సీరియస్ పోలీసు ఆఫీసర్ పాత్రలో ఆయన యాక్ట్ చేశారు.
‘ఉగ్రం’ కథ విషయానికొస్తే.. సీఐ శివ కుమార్ (అల్లరి నరేష్) తప్పిపోయిన తన భార్య (మిర్నా), కూతురు కోసం వెతుకుతుంటాడు. అదే టైమ్‌లో సిటీలో చాలా మంది మిస్సవుతారు.
సిటీలో ఈ మిస్సింగ్ కేసుల వెనుక ఎవరు ఉన్నారు? సీఐ శివ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? మిస్సింగ్ కేసుల మిస్టరీని అతడు ఛేదించా లేదా అనేదే మిగిలిన కథ.
సాధారణ ప్రజలు తప్పిపోతే వెతికిపెడతారు పోలీసులు. అలాంటి పోలీసుల కుటుంబీకులు మిస్సయితే పరిస్థితి ఏంటనే ‘ఉగ్రం’ స్టోరీ లైన్ బాగుంది.
‘ఉగ్రం’ చిత్రం మొదటి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా సాగుతూ అలరిస్తుంది. అయితే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమా వేగానికి అడ్డుకట్ట వేశాయి.
కమర్షియల్ ఎలిమెంట్స్, సినిమాటిక్ లిబర్టీస్‌ను పక్కనపెట్టి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో కథ చెప్పుంటే ‘ఉగ్రం’ చాలా బాగుండేది.
‘నాంది’ మాదిరిగానే కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా తీసుంటే ‘ఉగ్రం’ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది.
సీఐ శివ కుమార్ పాత్రలో అల్లరి నరేష్ చాలా బాగా యాక్ట్ చేశారు. తనలోని మాస్ యాంగిల్‌ను బయటకు తీసి మెప్పించారు. యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపారు.
మెచ్యూరిటీతో యాక్ట్ చేసిన నరేష్ కోసం ‘ఉగ్రం’ను ఒకసారి చూడొచ్చు. ఆయన తర్వాత ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు శత్రు. హీరోయిన్ మిర్నా, సీనియర్ నటి ఇంద్రజ కూడా బాగానే నటించారు.
‘ఉగ్రం’ చిత్రంలో యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీని మెయిల్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు.
నరేష్‌లోని మాస్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేయడంలో ఈ రెండు విభాగాలు సక్సెస్ అయ్యాయి.
యాక్షన్ డ్రామా మూవీస్ ఇష్టపడే వారు ‘ఉగ్రం’ మూవీకి వెళ్లొచ్చు. ఈ సినిమా వారికి నచ్చుతుంది. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు.