రెండు తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది.

తెలుగు ప్రజలు అంతా ఉగాది పర్వదినాన్ని కన్నులపండువగా జరుపుకున్నారు.

ఉగాది రోజు షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరించడమే కాకుండా.. పంచాంగ శ్రవణం కూడా చేస్తారు

ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషీ చెప్పిన రాశిఫలాల ఆధారంగా ఈ 5 రాశుల వారికి ఈ ఏడాది చాలా బాగుంటుంది.

మేషరాశి: ద్వాదశ స్థానంలో గురువు ఉండటం వల్ల.. జీవితం బాగుపడుతుంది.

పెళ్లికాని వారు ప్రయత్నాలు చేసుకోవచ్చు.

ఈ ఏడాది శుభకార్యాలు బాగా చేస్తారు. తాహతకు మించి అప్పులు చేయకండి. ఈ ఏడాది ఇల్లు కట్టుకోవడానికి మేషరాశి వాళ్లు ప్రయత్నించాలి.

వృషభ రాశి: శని, గురు గ్రహం ఈ రాశి వారికి అనుకూలం. ఈ ఏడాది వీళ్లు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.

చాలీ చాలని జీతంతో ఉద్యోగం చేసే వాళ్లు మానేసి వ్యాపారం చేసుకోవడం ఉత్తమమని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయం, వ్యాపారం వీరికి కలిసొస్తుంది.

మిథున రాశి: సూర్యుడు ఎప్పుడైతే అనుకూలిస్తాడో అప్పుడు లక్ ని పరీక్షించుకోవాలి. శుక్ర, రవి గ్రహమున్న సమయంలో వ్యాపారం స్టార్ట్ చేస్తే కొనసాగుతుంది.

విద్యార్థులకు విదేశీ యోగం.. రైతులకు బాగా కలిసొస్తుంది. నమ్మక ద్రోహానికి గురయ్యే ప్రమాదం ఉంది.

కర్కాటక రాశి: పుష్యమీ నక్షత్రం వాళ్లు ఈ ఏడాది చెప్పుడు మాటలు వినకండి. ఇప్పుడు అదృష్టాన్ని మిస్ అయితే మళ్లీ 12 ఏళ్లు వెయిట్ చేయాలి.

విదేశాలు వెళ్లాలనుకుంటే వెళ్లిపోండి. వ్యాపారం ప్రారంభించాలి అంటే ప్రారంభించేయండి. భూ, వస్త్ర వ్యాపారాలు కలిసొస్తాయి.

తులారాశి: ఈ ఏడాది బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఎంత ఖర్చు పెడితే అంత సంపాదిస్తారు.

55 ఏళ్లు దాటిన వాళ్లు పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకండి. విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 

అత్తా కోడళ్లు కూడా గొడవలు పడే అవకాశం ఉంటుంది. ఫుడ్, ల్యాండ్ బిజినెస్ చేసేందుకు ప్రయత్నించండి.