విశాఖ వడ్లపూడి తిరుమల నగర్ లో నివసించే వరప్రసాద్, మీరా దంపతులు ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఓ ఇటీవల ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలంగా మారింది.

ఆ వీడియోలో.. మేము అప్పుల బాధ నుంచి తట్టుకోలేకపోతున్నాం.. డబ్బులు చెల్లించలేదని మా పిల్లలను ఏమి అనొద్దు అంటూ ఏడుస్తూ వీడియోలో మాట్లాడారు.

ఆ తర్వాత ఆ దంపతులు సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అప్పటి నుంచి కనిపించకుండాపోయారు.

 ఈ ఘటనపై దంపతుల కుమారుడి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు ఈ దంపతుల ఆచూకి కోసం చాలా చోట్ల గాలించారు. 24 గంటలు గడిచినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.

ఈ క్రమంలోనే అనాకపల్లి జిల్లా ఏలేరు కాల్వలో తాజాగా ఇద్దరి వ్యక్తుల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి.

అవి ఖచ్చితంగా.. కనిపించకుండాపోయిన వరప్రసాద్, మీరా దంపతుల మృతదేహాలేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు వరప్రసాద్, మీరా దంపతుల కుటుంబ సభ్యులను పిలిపించి ఆ మృతదేహాలు ఆ దంపతులవేనా కాదా? అన్నది చెబుతామని పోలీసులు తెలిపారు.

ఆ ఏలేరు కాల్వలోని నీటిపై తేలియాడుతున్న ఆ మృతదేహాలు ఖచ్చితంగా.. వరప్రసాద్, మీరా దంపతులవేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.