వర్షాకాలంలో ఎక్కువ మందిని దగ్గు, జలుబు ఇబ్బంది పెడుతుంటాయి.

పొడి దగ్గు పగటి పూట కంటే రాత్రి వేళ బాగా ఇబ్బంది పెడుతుంది.

అయితే కొన్ని చిట్కాలతో దగ్గు, జలుబు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

పొడి దగ్గు వచ్చినప్పుడు కొద్దిగా వాము తీసుకుని బుగ్గన పెట్టి.. రసాన్ని మింగుతూ ఉండాలి.

దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి.

అల్లం రసం, నిమ్మరసం, తేనె ఈ మూడూ కలిపి ఒక మిశ్రమంగా తయారుచేసుకుని తాగితే జలుబు తగ్గుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

జలుబు ఎక్కువగా ఉండి.. ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు గిన్నెలో వేడి నీటిని తీసుకుని.. చిటికెడు పసుపు, విక్స్ లేదా జండూబామ్ ను వేసి ఆవిరి పీల్చాలి. ఇలా చేస్తే జలుబు తగ్గుతుంది.

అల్లం టీతో కూడా జలుబు, దగ్గు తగ్గించుకోవచ్చు.      

దగ్గు విపరీతంగా ఉన్నప్పుడు మిరియాల పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని సేవించాలి.

వేడి వేడి పాలలో పసుపు వేసి రోజులో రెండు సార్లు తాగాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

అరచేతిలో ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని నమిలి మింగితే దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. లేదా నీటిలో జీలకర్ర వేసి మరిగించి ఆ నీటిని తాగినా ఫలితం ఉంటుంది.    

కొండనాలుక కిందకి దిగినప్పుడు దగ్గు విపరీతంగా వస్తుంది. ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం పసుపు, మిరియాలు ముద్దలా కలిపి దాన్ని కొండనాలుకకు అంటిస్తే ఉపశమనం లభిస్తుంది.

కొంచెం వేడెక్కిన నీటిలో తులసి ఆకులని వేసి కాసేపు మరిగించాలి.

మరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టి గ్లాస్ లో పోసుకుని.. గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. ఇలా చేస్తే కఫం తొలగిపోయి జలుబు, దగ్గు తగ్గుతుంది.