సాధారణ ప్రజలకు సినిమా స్టార్స్‌ అంటే ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంతటి క్రేజ్‌ ను సంపాదించుకోవడానికి ఆ స్టార్స్‌ చాలానే కష్టాలు పడతారు. మరి అలాంటి స్టార్స్‌ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారో తెలుసా? మీరే చూసేయండి.

ప్రియాంక జావల్కర్‌ 2017లోనే యాక్టింగ్‌ కెరీర్‌ స్టార్ట్‌ చేసినా.. SR కల్యాణమండపం సినిమాతో క్రేజ్‌ సంపాదించుకుంది.

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా చేసిన విషయం అన్‌ స్టాపబుల్‌ షోతో ఫ్యాన్స్‌ కు తెలిసింది. అప్పటి నుంచి బాగా వైరల్‌ అవుతోంది.

రష్మిక మందన్న చిన్నప్పుడే మోడల్‌ గా చేసింది. గోకులం అనే మ్యాగ్జిన్‌ పై తన కవర్‌ ఫొటో కూడా ప్రింట్‌ అయ్యింది.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాల్లోకి రాక ముందు నుంచి స్టైలిష్‌ స్టార్‌ గానే ఉన్నాడు.

స్టార్‌ హీరోయిన్‌, డాన్సర్‌, హోస్ట్‌ గా  చేసిన తమన్నా సినిమాల్లోకి రాక ముందు కూడా అంతే క్యూట్‌ గా ఉండేది.

ప్రస్తుతం సౌత్‌, నార్త్‌ ఇండస్ట్రీల్లో చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న హీరోయిన్‌ పూజా హెగ్దే.

కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌ గా ఉన్నప్పుడు కూడా మెగాస్టార్‌ లో అదే గ్రేస్‌ ఉండేది.

పవన్‌ కల్యాణ్‌.. పవర్‌ స్టార్‌ కాక ముందు ఇలా ఉండేవారు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌- అల్లు అర్జున్‌ మధ్య చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్‌ బాండింగ్‌ ఉండేది.

నయనతార సినిమాల్లోకి రాక ముందు న్యూస్‌ రీడర్‌ గా చేసిన విషయం తెలిసిందే.

కాజల్ అగర్వాల్‌ 2004లో ‘Kyun’ అనే హిందీ సినిమాతో తన యాక్టింగ్‌ కెరీర్‌ ను ప్రారంభించింది.

అనుష్క ఎనిమిదిసార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయిన హీరోయిన్‌. మూడుసార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు దక్కించుకుంది.

తారక్‌ తన కెరీర్‌ లో రెండు నంది, రెండు ఫిల్మ్‌ ఫేర్‌, నాలుగు సిని‘మా’ అవార్డులు అందుకున్నాడు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు రీల్‌ హీరోగానే కాదు.. రియల్‌ హీరోగా కూడా ఎందరో ముఖంపై చిరునవ్వులు పూయిస్తున్నాడు.

ధనుష్‌ హీరో మాత్రమే కాదు.. నిర్మాత, డైరెక్టర్‌, రచయిత, లిరిసిస్ట్‌, డాన్సర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌ కూడా.