(మహేశ్ బాబు) బాలీవుడ్ నుండీ నాకు చాలా సార్లు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ బాలీవుడ్ నన్ను భరించలేదు. నాకు తెలుగు సినిమానే కంఫర్ట్ . తెలుగు సినిమా బాలీవుడ్ జనాలకి కూడా రీచ్ అవ్వాలి అనేది నా ఉద్దేశం.
(ప్రియమణి) సౌత్ నటీనటులను నార్త్ లో ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు సౌత్ టాలెంట్‌కి బాలీవుడ్‌లో గుర్తింపు దక్కుతోంది. ఇక బాలీవుడ్ ఎంట్రీ అనేది మనం డిసైడ్ చేసుకోకూడదు మనకి వచ్చే స్క్రిప్ట్ లు, పాత్రలు డిసైడ్ చేయాలి.
(శృతీ హాసన్) బాలీవుడ్ లో సినిమాలు చేసినా అక్కడి జనాలు సౌత్ జనాలు అంటే వేరే విధంగా ట్రీట్ చేస్తుంటారు. కాబట్టి అక్కడి వాళ్ళ దగ్గర నేను ఔట్ సైడర్ లానే ఉంటాను.
(యష్) ఇన్నాళ్టికి వాళ్ళు మన సినిమాలను అర్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రత్యేకంగా ఎంట్రీ ఇవ్వాల్సిన పని లేదు. కంటెంట్ బాగుంటే మన సినిమాలని వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు.
(ధనుష్) ‘సౌత్, నార్త్ అని ప్రత్యేకించి విభజించాల్సిన పని లేదు. బాలీవుడ్ కు మన సౌత్ ఏమాత్రం తీసిపోదు. కానీ కొన్ని మార్పులు జరగాలి అంతే.
(అల్లు అర్జున్) ‘నాకు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి కానీ అది నాకు ఎక్కువ జోష్ ఇచ్చిన విషయం ఏమీ కాదు. ఇప్పుడు మనం చేసే సినిమాల్లో హీరోలుగా చేస్తున్నప్పుడు ఇంకో భాషలో విలన్ గా చేయమనడం లేదా సెకండ్ హీరోగా చేయమనం సమంజసం కాదు.
(రామ్ చరణ్) విజయేంద్ర ప్రసాద్,రాజమౌళి వంటి వారు ఉంటే బాలీవుడ్ లో పని చేస్తాను. వారిలా అన్ని భాషల్లో కలిసొచ్చే సినిమాని తీయగలగాలి.
(ప్రభాస్) గతంలో ప్రభాస్(ఏక్ నిరంజన్ టైం లో) బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఇంకా ఏమీ సాధించలేదు. అక్కడికెళ్లి ఏం చేస్తాను’ అంటూ నవ్వుతు అన్నాడు.
(నాని) బాలీవుడ్ ఎంట్రీ అనేది పూర్తిగా కథ పై అలాగే దానిని హ్యాండిల్ చేయగల దర్శకుడు పై ఉంటుంది. మన చేతుల్లో ఏమి ఉండదు.
(Jr. NTR ) బాలీవుడ్ జనాలకి మన పై గౌరవం ఏర్పడింది. కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పై ఎక్కువ పడింది. నేను అక్కడికి వెళ్లి ఆ గౌరవాన్ని పోగొట్టాలి అని అనుకోవడం లేదు