2013 లో భారత్ లో అడుగుపెట్టిన ఈ సంస్థ భారతీయులకు అవసరమైన వస్తువులను ఇంటీకి డెలివరీ చేస్తూ ఎంతో చేరువైంది.
ఫ్లిప్‌కార్ట్ 2007 లో సచిన్ భన్సాల్ , బిన్నీ భన్సాల్ కలిసి బెంగుళూరులో స్థాపించారు.
మొదట్లో కేవలం పుస్తకాలు మాత్రమే విక్రయించిన ఈ సంస్థ. ఆ తర్వాత అన్ని రకాల వస్తువులని విక్రయిస్తూ , 2018లో దీన్ని వాల్మార్ట్ సంస్థ సొంతం చేసుకుంది
మీషో 2015లో IIT ఢిల్లీ గ్రాడ్యుయేట్లు విదిత్ఆత్రే మరియు సంజీవ్ బర్న్వాల్ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది.
మింత్ర అశుతోష్ లావానియా మరియు వినీత్ సక్సేనాతో కలిసి ముఖేష్ బన్సల్ 2007లో స్థాపించారు.
ఫ్యాషన్ దుస్తులను విక్రయించే ఈ సంస్థ . మే 2014లో ఫ్లిప్‌కార్ట్ దీనిని కొనుగోలు చేసింది.
రిలయన్స్ అనుబంధ సంస్థగా ఏజియోని ముకేశ్ అంబానీ 2016లో స్థాపించారు. ఫ్యాషన్ దుస్తులను విక్రయించే ఈ సంస్థ బెంగళూరులో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది
ఓఎల్ఎక్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయం ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉంది. వాడిన వస్తువులను సెకండ్ హ్యాండ్ లో విక్రయించే వేదికగా దీనిని రోపొందించారు మనదేశంలో ఓఎల్ఎక్స్ కి మంచి ఆదరణ ఉంది
ఫిబ్రవరి 2017లో,పేటీఎమ్ తన పేటీఎమ్ మాల్ యాప్‌ను ప్రారంభించింది. పేటీఎమ్ మాల్ భారతదేశం అంతటా 17 కేంద్రాలను ఏర్పాటు చేసింది మరియు 40 కంటే ఎక్కువ కొరియర్ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది
స్నాప్‌డీల్ భారతదేశంలోని న్యూ ఢిల్లీలో ఉన్న ఇ-కామర్స్ కంపెనీ. ఫిబ్రవరి 2010లో కునాల్ బహ్ల్ మరియు రోహిత్ బన్సాల్ స్థాపించారు
2019లో జియోమార్ట్ ని రిలయన్స్అధినేత ముకేశ్ అంబానీ తీసుకొచ్చిన మరో ఈ-కామర్స్ సంస్థ . ఇందులో ఇంటికి సంబందించిన సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్ని లభిస్తాయి
నైకా అనేది భారతీయ ఇ-కామర్స్ కంపెనీ, దీనిని 2012లో ఫల్గుణి నాయర్ స్థాపించారు.
2020లో, ఇది ఒక మహిళ నేతృత్వంలోని మొదటి భారతీయ యునికార్న్ స్టార్టప్‌గా అవతరించింది.
పీయూష్ భన్సల్ లెన్స్కార్ట్ ని 2010లో స్థాపించారు. భారత్ లో ఆన్ లైన్ లో కళ్లజోళ్లు విక్రయించే అతిపెద్ద సంస్థ ఇది