ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
భారత్ లోను 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఆర్బీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.
సుప్రీం కోర్టు తీర్పుతో మన దేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగం ఊపందుకుంది. ఎంతలా అంటే.. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలబడేంత.
మన దేశంలో పది కోట్ల మందికిపైగా క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారని బ్రోకర్ చూస్ అనే సంస్థ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో తక్కవ సమయంలో అధిక లాభాలను ఇచ్చే టాప్-10 క్రిప్టో కరెన్సీ ఏవో ఇప్పుడు చూద్దాం.