సినీ పరిశ్రమలో పలువురు అనారోగ్య సమస్యలతో ఆసుప్రతుల్లో చేరుతున్నారు.
టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురై గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
తాజాగా సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు.
మెరుగైన వైద్యం కోసం ఆయనను శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుప్రతికి తరలించారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితికి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఆయనను ఐసీయూ నుండి జనరల్ రూమ్‌కు షిఫ్ట్ చేశామని డాక్టర్లు తెలిపారు.
ఈ విషయం తెలిసి శరత్ బాబు అభిమానులు కాస్త కుదుటపడ్డారు. అలాగే త్వరగా కోలుకుని రావాలని ఆకాంక్షిస్తున్నారు.
శరత్ బాబు 1951 జులై 31 న ఆంధ్రప్రదేశ్‌లోని ఆముదాలవలసలో జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 72 ఏళ్లు.
శరత్ బాబు 1951 జులై 31 న ఆంధ్రప్రదేశ్‌లోని ఆముదాలవలసలో జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 72 ఏళ్లు.
ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. 1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు ఇప్పటి వరకు 220కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు.
తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.
1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు.
దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించారు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో శరత్ బాబు ముఖ్యమైన పాత్రలు పోషించారు
కాగా, ఆయన నరేష్, పవిత్ర జంటగా నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల కాపురం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.