ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒక ఔన్సు వద్ద ఇవాళ ఉదయం 10.11 గంటల సమయానికి 1837.45 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 21.69 డాలర్లకు చేరుకుంది.
ఉదయం 8 గంటల సమయంలో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 1842.87 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 21.77 డాలర్లు ఉంది.
2 గంటల వ్యవధిలో బంగారం, వెండి ధరలు తగ్గాయి.
ఇక దేశీయంగా చూస్తే ఇక్కడ కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి.
ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.
నిన్నటి మీద ఇవాళ (ఫిబ్రవరి 17న) 10 గ్రాముల బంగారం వద్ద రూ. 100 తగ్గింది. వెండి ధర కూడా కిలో వద్ద రూ. 100 తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఇవాళ రూ. 52,250 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,000 గా ఉంది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 100 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 120 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ. 52,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600 ఉంది.
ఇక హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,100 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,830 ఉంది.
నిన్న ఇదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 56,950 ఉంది.
ఇక కిలో వెండి ధర ఢిల్లీలో ఇవాళ రూ. 68,500 పలుకుతుండగా.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో ధర రూ. 71,700 పలుకుతోంది.
ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.