అందమైన కురులు కావాలని మహిళలు ఎంతో ఆశపడుతుంటారు.

ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఇతర సమస్యల కారణంగా జుట్టు సమస్యలు ఊడిపోతుంటుంది.

ఒత్తిడి, ఇతర ఆరోగ్య సమస్యల కారణాల వల్ల జుట్టు ఊడిపోవడం, తెల్లగా మారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి.

ఈ సమస్యలను చిన్న చిట్కాలతోనే సమస్యని దూరం చేసుకోవచ్చు. 

తలస్నానం : వారానికి రెండు లేదా మూడు సార్లు సల్ఫేట్ ఫ్రీ షాంపూతో స్నానం చేయాలి.  అలా తలస్నానం చేయడం వల్ల జుట్టులోని దుమ్ము, ధూళి వంటి సమస్యలు దూరమవుతాయి. 

ఆనియన్ జ్యూస్ : ఉల్లి చేసిన మేలు తల్లి చేయలేదు అంటారు. ఉల్లిగడ్డ.. ఎన్నో పోషకాలు కలిగి ఉంది.. ఇది ఆరోగ్యానికే మాత్రమే కాదు. జుట్టుకి కూడా చాలా మంచిది.

ఉల్లి జ్యూస్ చేసుకని.. కొబ్బరి నూనె లేదా నిమ్మరసంలో కలపాలి. అరగంట సేపు తలకు పట్టించి.. ఓ అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే  జుట్టు సమస్యలు దూరమవుతాయి

రైస్ వాటర్ : బియ్యం నీరు జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది. ఒక చిన్న గ్లాసులో బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి ఆ తర్వాత రాత్రంతా నానబెట్టాలి.

బియ్యం నీటిని జుట్టుకు పట్టించి స్నాచం చేస్తే ఎంతో ధృడంగా ఉంటుంది.

గుడ్డు సొన : మనం రోజూ తినే గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. గుడ్లు కూడా జుట్టు సమస్యల్ని చాలా వరకూ దూరం చేస్తాయి.  గుడ్డు సొన తీసుకొని  అందులో అలోవేరా జెల్ కలపాలి. 

ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. కొద్ది సేపటి తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది

ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్ కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆయిల్‌లో ఒమేగా 3 యాసిడ్స్, న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి.  

ఈ ఆయిల్ ని కాస్త వేడి చేసి తలకు పట్టించి.. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.