లక్నోలో ఈ ప్లేయర్లు కచ్చితంగా ఉండబోతున్నారు అని టాక్ మొదలైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐదుగురు స్టార్ ప్లేయర్లను లక్నో ఫ్రాంచైజ్ దక్కించుకోనుందని తెలుస్తోంది.
జట్టులో సొంత రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు ఉంటే అభిమానుల్లో ప్రాంతీయాభిమానం కూడా పెరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.
ఇప్పటి వరకు సొంత టీమ్ లేక వేరే జట్లలో ఆడుతున్న ఉత్తరప్రదేశ్ ప్లేయర్లను లక్నో సొంతం చేసుకునే అవకాశం లేకపోలేదు.
అక్షదీప్ నాథ్(పంజాబ్ కింగ్స్)లను దక్కించుకునేందుకు ఇప్పటికే లక్నో టీమ్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.