దసరా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వెండితెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రాలు థియేటర్‌లవైపు క్యూ కడుతున్నాయి.
ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు ఓటీటీలోనూ ఇంకొన్ని సినిమాలు సందడి చేయటానికి సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా!
ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. యువతను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇటీవల ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
లక్ష్మి సౌభాగ్య దర్శకురాలిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబరు 29న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమైంది.
అనిల్ ఇనమడుగు కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘తీరం’. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏ.హర్ష తెరకెక్కించిన చిత్రం ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’కి సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదల కానుంది.
ఫ్యామిలీ డ్రామా (తెలుగు చిత్రం)అక్టోబరు 29